నర్సింగ్ ఆఫీసర్ల(స్టాఫ్) ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 14వ తేదీతో గడువు ముగియటంతో వైద్యారోగ్యశాఖ సమయాన్ని పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 లోపు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ముందుగా 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా… ఇటీవలే మరో 272 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా సర్కార్ జత చేసింది.
ఈ కొత్త పోస్టులు కలిపి మొత్తం 2,322 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు ఉంటే.. అక్టోబర్ 21, 22 తేదీల్లో ఎడిట్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థు బోర్డు వెబ్‌సైట్ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చు.
వైద్యారోగ్యశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉంది. కానీ తాజాగా తేదీని మారుస్తూ ప్రకటన విడుదలైంది. నవంబర్ 17వ తేదీన కాకుండా… నవంబర్ 23వ తేదీన నిర్వహించనున్నారు.
అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు. ఈ పోస్ట్‌లకు సంబంధించి పే స్కేల్ రూ.36,750 – రూ.1,06,990 వరకు చెల్లిస్తారు.
ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు. దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200 చెల్లించారు. అయితే దరఖాస్తు రుసుముపై వివిధ వర్గాలకు మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, తెలంగాణ మాజీ సైనికులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు గల తెలంగాణకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
కొత్త నోటిఫికేషన్ లో మరో 272 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అక్టోబర్ 11వ తేదీన వైద్యారోగ్యశాఖ తెలిపింది. వీటిని కలిపితే మొత్తం 2322 పోస్టులు కానున్నాయి.
సంబంధిత కథనం