TGPSC Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్.. ఈనెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు-high court green signal to telangana group 1 mains exams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్.. ఈనెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు

TGPSC Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్.. ఈనెల 21 నుంచి యథావిధిగా పరీక్షలు

Basani Shiva Kumar HT Telugu
Oct 15, 2024 11:30 AM IST

TGPSC Group 1 Mains : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. ఇటు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి.. హాల్ టికెట్లను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్
గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ (istockphoto)

టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 21 నుంచి యథావిధిగా మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. రెండు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31 వేల 382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి.

గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. https://hallticket.tspsc.gov.in ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, క్యాప్చా ఎంటర్ చేస్తే.. పీడీఎఫ్ ఫార్మాట్‌లో హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతోంది.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు జనరల్ ఇంగ్లీష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. అంటే మెయిన్స్‌లో భాగంగా ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతీ పేపర్‌ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల షెడ్యూల్..

జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.

పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.

పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.

పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.

పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.

పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.

పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.

Whats_app_banner