NIMS Admissions 2024 : బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు - హైదరాబాద్ నిమ్స్ నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే
NIMS Hyderabad Admissions 2024 : బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం హైదరాబాద్ లోని ‘నిమ్స్’ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.nims.edu.in/index వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
NIMS Hyderabad Admissions 2024 : బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి హైదరాబాద్ లోని ‘నిమ్స్’ (నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ప్రకటన జారీ చేసింది. 2024 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్‌లో 100 సీట్లను భర్తీ చేస్తారు. ఇక బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత హార్ట్ కాపీని ఆగస్టు 27వ తేదీలోపు నిమ్స్ లో సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాథమికంగా ఎంపికైనవారి మెరిట్ జాబితాను సెప్టెంబర్ 16వ తేదీన ప్రకటిస్తారు. తుది జాబితా సెప్టెంబర్ 18వ తేదీన వెల్లడిస్తారు. ఇదే తేదీన తొలి విడత కౌన్సెలింగ్ కు అర్హత సాధించిన వారి వివరాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్ 20వ తేదీన అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ లెటర్స్ అందుతున్నాయి. అక్టోబరు 1వ తేదీన తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపుతో పాటు రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. బీఎస్సీ నర్సింగ్ తరగతులు డిసెంబర్ 09వ తేదీతో ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు.
ఓసీ, బీసీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2000 పేమెంట్ చేయాలి. https://www.nims.edu.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్…
మరోవైపు తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా… ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ(ఆగస్టు 8) కూడా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విడత కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థుల కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
తుది విడత కౌన్సెలింగ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్(ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్నవారు) ఆగస్టు 9వ తేదీన ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఆగస్టు 10వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్టు 13వ తేదీన తాత్కాలికంగా సీట్లు కేటాయింపు చేస్తారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా స్వయంగా రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 16 నుంచి 17 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్(కాలేజీ లేదా బ్రాంచ్ మార్పుకునేందుకు) కు అవకాశం ఉంటుంది. ఆగస్టు 17న కాలేజీల వారీగా విద్యార్థుల వివరాలను ప్రకటిస్తారు.
కావాల్సిన పత్రాలు…
- టెన్, ఇంటర్ మార్కుల మెమో
- ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(TC)
- స్టడీ సర్టిఫికెట్లు(6 నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా ఉండాలి)
- ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్(అంటే.. 01-01-2024 తర్వాత జారీ అయి ఉండాలి)
- కుల ధ్రువీకరణ పత్రం.
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(అంటే.. మీకు EWS రిజర్వేషన్ అర్హత ఉంటే స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి)
- ఆధార్ కార్డు
- ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 హాల్‌టికెట్
- పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు.