TG EAPCET Counselling 2024 : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాలు - తుది విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే
TG EAPCET Seat Allotment 2024 : తెలంగాణలో ఇంజినీరింగ్(ఈఏపీసెట్ 2024) అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తుది దశ విడత ప్రవేశాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభయ్యాయి.
తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశలు పూర్తి కాగా… ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విడత కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థుల కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
తుది విడత కౌన్సెలింగ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్(ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్నవారు) ఆగస్టు 9వ తేదీన ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఆగస్టు 10వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. ఆగస్టు 13వ తేదీన తాత్కాలికంగా సీట్లు కేటాయింపు చేస్తారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా స్వయంగా రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 16 నుంచి 17 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్(కాలేజీ లేదా బ్రాంచ్ మార్పుకునేందుకు) కు అవకాశం ఉంటుంది. ఆగస్టు 17న కాలేజీల వారీగా విద్యార్థుల వివరాలను ప్రకటిస్తారు.
ఉండాల్సిన పత్రాలు…
- టెన్, ఇంటర్ మార్కుల మెమో
- ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(TC)
- స్టడీ సర్టిఫికెట్లు(6 నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా ఉండాలి)
- ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్(అంటే.. 01-01-2024 తర్వాత జారీ అయి ఉండాలి)
- కుల ధ్రువీకరణ పత్రం.
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్(అంటే.. మీకు EWS రిజర్వేషన్ అర్హత ఉంటే స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి)
- ఆధార్ కార్డు
- ఈఏపీసెట్(ఎంసెట్) - 2024 హాల్‌టికెట్
- పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు.
ఈసారి తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో చూస్తే…. అగ్రికల్చర్ , ఫార్మ విబాగాలకు 91633 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.24 శాతం మంది పరీక్ష రాశారు. కాగా ఇంజనీరింగ్ విభాగంలో 2 లక్షల 40వేల 618 మంది పరీక్ష రాశారు. ఈసారి మొత్తం 3 లక్షల 32 వేల 251 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో పురుషులు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించగా, మహిళలు 90.18 శాతం క్వాలిఫై అయ్యారు. మొత్తం 89.66 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో అబ్బాయిలు…. 74.38 శాతం క్వాలిఫై అయ్యారు, అలాగే అమ్మాయిలు…. 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత సాధించారు.
How to Check TG EAMCET Results 2024: ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్) పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- TS EAPCET - Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ చాలా కీలకం.