AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి-ap telangana govt relieved ias officers as per dopt orders ghmc commissioner ilambarathi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Tg Ias Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

AP TG IAS Officer Relieve : ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

Bandaru Satyaprasad HT Telugu
Oct 16, 2024 09:28 PM IST

AP TG IAS Officer Relieve : డీవోపీటీ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ లను ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్ అయ్యారు. ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగుతామని క్యాట్, హైకోర్టులను ఆశ్రయించినా ఊరట దక్కలేదు.దీంతో ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఐఏఎస్ లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి
ఏపీ, తెలంగాణ ఐఏఎస్ అధికారులు రిలీవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ తెలుగు రాష్ట్రాల ఐఏఎస్‌ అధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని ఐఏఎస్‌ అధికారులు క్యాట్‌, హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ రెండు చోట్ల వీరికి ఊరట దక్కలేదు. దీంతో ఏపీ, తెలంగాణ సీఎస్ లు ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఐఏఎస్ లు సృజన, హరికిరణ్, శివశంకర్ ను ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయ్యి తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి రిపోర్టు చేశారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి

ఏపీలో రిపోర్టు చేయాల్సిన ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. వీరి స్థానంలో సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తి, ఎనర్జీ సెక్రటరీగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా శ్రీధర్, ఆరోగ్య శ్రీ సీఈవోగా ఆర్వీ కర్ణన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

హైకోర్టులో దక్కని ఊరట

తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన పలువురు ఐఏఎస్‌లకు చుక్కెదురైంది. క్యాట్ (Central Administrative Tribunal) ఉత్తర్వులపై ఐఏఎస్‌ అధికారులు వాణి ప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌, వాకాటి కరుణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం… ఐఏఎస్ అధికారులు వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్లపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను కోర్టులు నిర్ధారించరాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటే… దీనికి అంతం ఉండదని, క్యాట్ తీర్పు ప్రకారం అధికారులు తమకు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

హైకోర్టు ఆశ్రయించటం కంటే ముందు ఐఏఎస్ అధికారులు… క్యాట్ ను ఆశ్రయించారు. ఏపీ తెలంగాణ క్యాడర్ అధికారులు డీవోపీటీ ఉతర్వులను పాటించాల్సిందేననంటూ ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యానికి క్యాట్ నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఆలిండియా సర్వీసు అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16లోగా చేరాల్సిందేనని హైదరాబాద్లోని కేంద్ర పరిపా లనా ట్రైబ్యునల్(క్యాట్) బెంచ్ స్పష్టం చేసింది.

డీఓపీటీ గత వారం ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి క్యాట్‌ నిరాకరించింది. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తు న్నామని పేర్కొంది. ఆలిండియా సర్వీస్ అధికారుల కేటాయింపుపై అధికారుల వ్యక్తి గత అభ్యర్ధనలను పరిశీలించి.. నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు గత జనవరిలో ఆదేశాలు ఇచ్చింది.

Whats_app_banner

సంబంధిత కథనం