LIVE UPDATES
Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య
Telangana News Live October 13, 2024: Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య
13 October 2024, 17:38 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Telangana News Live: Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య
- Kamareddy : కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందడంతో.. వారి గ్రామంలో విషాదయ ఛాయలు అలుముకున్నాయి.
Telangana News Live: Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని.. చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం: హరీష్ రావు
- Harish Rao : తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడంపై మాజీమంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని ట్వీట్ చేశారు. రాజ్యాంగం ఖూనీ జరుగుతోందని ఆరోపించారు.
Telangana News Live: Constable Selfie Video : గంజాయి కేసులో సస్పెండ్..! కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు
- Bhadradri Kothagudem District News : గంజాయి కేసులో సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇద్దరు ఎస్ఐలపై సంచలన ఆరోపణలు చేశాడు. గంజాయి కేసులో తనను బలి పశువును చేశారని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Telangana News Live: SCR Dasara Special Trains : ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు
- Dussehra Special Trains 2024 : ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
Telangana News Live: TG MLC Vote Registration : ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారా..! స్టెప్ బై స్టెప్ ఇలా చేయండి
- Telangana MLC Elections 2025 : తెలంగాణలో త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల (నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్)కు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
Telangana News Live: Alai Balai 2024 : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్.. ఈసారి స్పెషల్ ఇదే!
- Alai Balai 2024 : హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ అలయ్ బలయ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజనాలు సిద్ధం చేశారు.
Telangana News Live: TGPSC Group 1 Hall Tickets 2024 : రేపు గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల - మొత్తం 7 పేపర్లు, పూర్తి షెడ్యూల్ ఇదే
- TGPSC Group 1 Mains Hall Tickets : తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు రేపు(అక్టోబర్ 14) విడుదల కానున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయి. TGPSC వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Telangana News Live: CM Revanth in Kondareddypalli : సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి రేవంత్ రెడ్డి - అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- దసరా వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించగా… మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొంత గ్రామానికి వచ్చిన రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
Telangana News Live: TG Govt Jobs 2024 : వైద్యారోగ్యశాఖలో 2,322 ఉద్యోగాలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే...!
- రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి విడుదలైన నర్సింగ్ పోస్టుల దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అక్టోబర్ 14వ తేదీతో అప్లికేషన్ల స్వీకరణ పూర్తి కానుంది. తొలుత 2050 ఖాళీలు ఉండగా.. తాజాగా మరో 272 పోస్టులను జత చేశారు. దీంతో మొత్తం 2322 ఖాళీలను భర్తీ చేయనున్నారు.