ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక టీచర్ల కూడా పైన పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ వారు Form-19 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలతో పాటు టీచర్ గా పని చేసిన ప్రాంతాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫొటో కూడా అప్ లోడ్ చేయాలి. చివర్లో సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
పైన పేర్కొన్న నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది. అక్టోబర్ 16, 25వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారు. 2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయాలి. 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరిస్తారు.