SCR Dasara Special Trains : ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు-dussehra special trains between kakinada town secunderabad 2024 details check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Dasara Special Trains : ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు

SCR Dasara Special Trains : ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ - కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్, ఇవిగో వివరాలు

Dussehra Special Trains 2024 : ప్రయాణికుల రద్దీ వేళ దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 14, 15 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

దసరా ప్రత్యేక రైళ్లు

దసరా పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇప్పటికే గ్రామాలకు చేరిన ప్రజలు… తిరిగి పట్నం వైపు వచ్చేందుకు చూస్తున్నారు. బస్సులు లేదా రైళ్ల టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారు. రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. కాకినాడ - సికింద్రాబాద్ రూట్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వివరించింది.

కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీన రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 08.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య స్పెషల్ ట్రైన్ సర్వీస్ నడవనుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 15వ తేదీన సాయంత్రం 06.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.30 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుతుంది.

ఈ స్పెషల్ ట్రైన్లు... సామల్ కోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. వీటిల్లో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

తిరుపతి ప్రత్యేక రైళ్లు…

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఎనిమిది వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వివరాలు చూస్తే... జల్నా నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు ఉంటుంది. అక్టోబర్ 20, 27, నవంబర్ 11 తేదీల్లో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఆదివారం 7.10 గంటలకు జల్నా నుంచి బయల్దేరి... మరునాడు సాయంత్రం 6.30 గంలటకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక తిరుపతి నుంచి జల్నాకు ప్రత్యేక ట్రైన్ నడవనుంది. ఈ ట్రైన్ అక్టోబర్ 14, 21, 28తో పాటు నవంబర్ నవంబర్ 4వ తేదీన తిరుపతి నుంచి బయల్దేరుతుంది. రాత్రి 9.10 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 7 గంటలకు జల్నా చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు పతూర్, మన్వత్ రోడ్డు. పర్బాణీ, గంగాఖేర్, పర్లీ వజీనాథ్, లాథూర్ రోడ్డు, బాల్కీ, బీదర్, జహీరాబాజ్, వికారాబాద్, తాండూరు, చిత్తాపూర్, యాదిగిర్, రాయిచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రేణిగుంట స్టేషన్లల్లో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.

భద్రాచలానికి ప్రత్యేక రైళ్లు - 95 సర్వీసులు

మరోవైపు బెల్గావి - మణుగూరు మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అక్టోబర్ 16 నుంచి వచ్చే ఏడాది మార్చి 30వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుందని వెల్లడించింది. ఈ ట్రైన్ ఆది, బుధ, శనివారం, మంగళవారం తేదీల్లో మధ్యాహ్నం 12. 30 గంటలకు బెల్గావి నుంచి బయల్దేరుతుంది. మరునాడు 12.50 గంటలకు మణుగూరుకు చేరుతుంది.

ఇక మణుగూరు -బెల్గావి మధ్య కూడా స్పెషల్ ట్రైన్ నడవనుంది. అక్టోబర్ 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు మొత్తం 95 సర్వీసులు నడుస్తాయని వివరించింది. ఈ రైళ్లు...ఖానాపూర్, అలన్వార్, హుబ్లీ, కొప్పల్, హోసిపేట్, బల్లారి, గుంతకల్, ఆదోని, కోస్లీ, మంత్రిలాయం, యాద్గిర్, చిత్రపుర్, తాండూర్,వికారాబాద్, లింగపల్లి, బేగంపట్, సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాద్, డోర్నకల్, భద్రాచంల స్టేషన్లలో ఆగుతాయి.