తెలుగు న్యూస్  /  Telangana  /  Today Cm Kcr To Visit In Jagtial District

CM KCR Jagtial Tour : ఇవాళ జగిత్యాలకు సీఎం కేసీఆర్.. మోతెలో భారీ బహిరంగ సభ

HT Telugu Desk HT Telugu

07 December 2022, 7:48 IST

    • CM KCR Jagtial Tour Updates: ఇవాళ జగిత్యాలలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంతో పాటు వైద్య కళాశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిజామాబాద్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలనుద్దేశించి బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (twitter)

సీఎం కేసీఆర్

Today CM KCR Jagtial District Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన కొనసాగుతోంది. తాజాగా పాలమూరులో పర్యటించిన ఆయన... బుధవారం జగిత్యాల జిల్లాకు వెళ్లనున్నారు. జగిత్యాలలో టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం నిర్మించనున్న కొత్త వైద్య కళాశాలకు సంబంధించి భూమిపూజ చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

షెడ్యూల్ ఇలా...

మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్‌ ఆవరణలోని హెలీపాడ్‌కు చేరుకుంటారు. 12:35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి చేరుకుంటారు సీఎం కేసీఆర్. 12:40 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 12:55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి, ఒంటి గంటకు వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1:15కు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే జిల్లా అధికారులతో సమావేశమవుతారు.

భారీ బహిరంగ సభ...

మధ్యాహ్నం 3 గంటలకు సమీకృత కలెక్టరేట్‌ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 3:10 గంటల వరకు మోతె శివారులోని బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగించి సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటారు.

సీఎం పర్యటన సందర్భంగా జగిత్యాల పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన రహదారులు ఫ్లెక్లీలతో నిండిపోయాయి. సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ భారీగా జనసమీకరణ చేస్తోంది. 30 ఎకరాల్లో నిర్వహించే భారీసభకు 2 లక్షల మందికిపైగా తరలించేలా ప్రణాళిక రూపొందించారు.