తెలుగు న్యూస్  /  Telangana  /  Tenth Class Tribal Girl Raped In Vikarabad Distrct Yalal Mandal

Tribal Girl Raped : గిరిజన బాలికపై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

22 February 2023, 12:56 IST

    • Tribal Girl Raped  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యానికి ఓ గిరిజన బాలిక జీవితం బలైపోయింది.  విహార యాత్రకు తీసుకెళ్లిన విద్యార్ధిని ఇంటికి చేర్చే బాధ్యతను స్థానిక యువకుడికి అప్పగించారు. నలుగురు విద్యార్ధినులను కారులో తీసుకెళ్లిన యువకుడు  ముగ్గురిని ఇళ్ల వద్ద వదిలేసి  ఓ విద్యార్ధినిపై నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.   మర్నాడు పాఠశాల ఉపాధ్యాయులకు బాధితురాలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.  బాధిత కుటుంబం పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
వికారాబాద్‌ జిల్లాలో గిరిజన విద్యార్ధినిపై అత్యాచారం
వికారాబాద్‌ జిల్లాలో గిరిజన విద్యార్ధినిపై అత్యాచారం

వికారాబాద్‌ జిల్లాలో గిరిజన విద్యార్ధినిపై అత్యాచారం

Tribal Girl Raped వికారాబాద్‌ జిల్లా యాలాల్‌‌ మండలం అర్దనూర్‌ జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారం జరిగింది. ఈ నెల 13వ తేదీన పాఠశాలలోని 89 మంది విద్యార్ధులు, 8మంది టీచర్లు హైదరాబాద్ విహార యాత్రకు వెళ్లారు.వీరితో పాటు హెడ్మాస్టర్ వెంకటస్వామి కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు రెండు ఆర్టీసీ బస్సుల్లో టూర్‌కు వెళ్లారు. 14వ తేదీ తెల్లవారుజామున విద్యార్ధులు , పాఠశాల సిబ్బంది తిరిగి స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో నలుగురు బాలికల ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఎవరు రాలేదు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

హైదరాబాద్‌ విహార యాత్రకు వెళ్లొచ్చిన తర్వాత బాలికలు ఇళ్లకు చేరేందుకు తోడు లేకపోవడంతో పాఠశాలలోనే ఉండిపోయారు. యాలాల్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో వారిని ఇళ్లకు పంపే విషయంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిరంచారు. నలుగుు బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు రాకపోవడంతో సమీపంలో నివసించే పాఠశాల పూర్వ విద్యార్ధి రఘుపతితో బాలికలను ఇంటికి పంపారు.

విద్యార్ధినులను వారి ఇంటి వద్ద దింపాలని ఉపాధ్యాయులు సూచించడమే వారు చేసిన పాపమైంది. వీరిశెట్టిపల్లి, పేరికం పల్లికి చెందిన నలుగురు విద్యార్ధినుల తల్లిదండ్రులు14వ తేదీ తెల్లవారు జామున పాఠశాలకు రాలేదు. ఆ సమయంలో నిందితుడు రఘుపతి కారులో వెళుతుండగా ప్రధానోపాధ్యాయుడు వెంకట స్వామి వారిని ఇళ్ల వద్ద దింపాలని కోరాడు. వీరిశెట్టిపల్లిలో ముగ్గురు బాలికల్ని ఇళ్ల వద్ద దింపేసిన తర్వాత, పేరికం పల్లి వెళుతున్న మార్గంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు.

మర్నాడు పాఠశాలకు వచ్చిన బాలిక రఘుపతి నిర్వాకాన్ని ఉపాధ్యాయులకు వివరించినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడితో క్షమాపణలు చెప్పిస్తామని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించడంతో బాధితులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన యాలాల్ పోలీసులు నిందితుడు రఘుపతిని అరెస్ట్ చేశారు. ఘటనపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగడం ప్రధానోపాధ్యాయుడు రఘుపతిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. క్లాస్ టీచర్‌, హెడ్మాస్టర్‌కు చెప్పినా ఉపయోగం లేకపోయిందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

టాపిక్