తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రికత్త..

Bandi sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రికత్త..

HT Telugu Desk HT Telugu

26 August 2022, 12:52 IST

google News
    • Bandi sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రికత్త నెలకొంది. యాత్రను కొందరు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది.
ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్
ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్

ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతున్న బండి సంజయ్

జనగామ జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్రను కొందరు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. టీఆర్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యకర్త వచ్చి బండి సంజయ్ గో బ్యాక్ అంటూ రావడంతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

బండి సంజయ్ పాదయాత్రతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని చెబుతూ పోలీసు యంత్రాంగం యాత్రను భంగం చేసి ఇటీవల బండి సంజయ్‌ను కరీంనగర్ తరలించారు. అయితే నిన్న హైకోర్టు ఈ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుక్రవారం ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతను తిరిగి మొదలు పెట్టారు.

కాగా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మధ్యాహ్నం 1.15 గంటలకు విచారణ జరగనుంది.

కాగా శుక్రవారం ఉదయం ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ మొదలు పెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఈ ఉదయం పాంనూరులో మాట్లాడారు.

‘ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మేము చేస్తున్న "ప్రజా సంగ్రామ యాత్ర"ను కేసీఆర్ అడ్డుకున్నాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి, కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. కోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు. నిజాం నవాబునే తరిమి కొట్టిన వీరులగడ్డ, మన తెలంగాణ గడ్డ అని కేసీఆర్ గుర్తుంచుకోవాలి.. మా బీజేపీ కార్యకర్తల్లోనూ అలాంటి వీరులే ఆవహించారు. ప్రజా సమస్యలను తెలుసుకునే విషయంలో.. వెనక్కి తగ్గేదే లేదు. మా బహిరంగ సభను కూడా అడ్డుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభను జరిపి తీరుతాం. బహిరంగ సభకు ముందే అనుమతి తీసుకున్నాం.. అయినా అనుమతి లేదని అనడం.. కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిదర్శనం. కోర్టు అనుమతితో బహిరంగ సభను నిర్వహించి తీరుతాం..’ అని వ్యాఖ్యానించారు.

ఆగిన చోట నుండే ప్రారంభంమైన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర స్టేషన్ ఘనపురం నియోజకవర్గం, ఉప్పుగల్ సమీపంలోని పాదయాత్ర శిబిరం నుంచి ప్రారంభమైంది.

ఉప్పుగల్, కూనూరు, గర్మేపల్లి మీదుగా నాగాపురం వరకు కొనసాగుతుంది. ఇవాళ నాగాపురం సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేస్తారు.

తదుపరి వ్యాసం