తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రేపే ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష‌… పాటించాల్సిన నిబంధ‌న‌లివే

రేపే ఎస్సై ప్రిలిమినరీ ప‌రీక్ష‌… పాటించాల్సిన నిబంధ‌న‌లివే

06 August 2022, 15:49 IST

    • telangana si preliminary exam: ఆదివారం తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పలు సూచనలు చేసింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు.
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష
ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష

Telangana State Level Police Recruitment Board: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న 17వేలకు పైగా ఉద్యోగాలకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు కూడా వచ్చాయి. అయితే రేపు (జూలై 7వ) ఎస్ఐ ప్రిలిమనరీ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే అందుబాటులో ఉంచింది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

నిబంధనలివే…

ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించరు.

ఎస్సై ప్రిలిమ్స్‌ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు వాటిని ఏ4 సైజ్‌లో రెండు వైపులా(హాల్‌టికెట్‌ ఒకవైపు, వెనుక వైపు సూచనలు ) వచ్చేలా ప్రింట్‌ అవుట్‌ను తీసుకోవాలి.

ప్రింట్‌అవుట్‌ తీసుకున్న తర్వాత దానిలో ఎడమవైపు కింది భాగంలో ఇచ్చిన బాక్స్‌లో పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను అతికించాలి. పిన్నులతో, గుండు పిన్నులతో ఫొటోలు పెట్టొద్దు.

ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు.

అభ్య‌ర్థులు త‌మ వెంట ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్‌ను త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి.

సెల్‌ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్‌ వాచీలు, కాలిక్యులేటర్లు సహా ఎలాంటి ఎల్రక్టానిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్‌ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహిందీ, టాటూలకు దూరంగా ఉండాలి.

ప్రతి అభ్యర్థి కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

పరీక్ష కేంద్రంలోకి బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నులు అనుమతిస్తారు.

ప‌రీక్ష 200 అబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లకు 200 మార్కులు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానంకి 0.20 మార్క్ క‌ట్ అవుతుంది. అంటే నెగిటివ్ మార్కులు ఉంటాయి.

పరీక్ష పత్రం ఇంగ్లిష్‌–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత OMR Sheet తీసుకుని అంద‌రిని ఒకేసారి బ‌య‌టికి పంపిస్తారు.

డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే...

మొదటగా బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.tslprb.in/ లోకి వెళ్లాలి.

తర్వాత Download Hall Tickets ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Sign in పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ హోం పేజీపై డిస్ ప్లే అవుతుంది. డౌన్ లోడ్ అప్షన్ పై క్లిక్ చేయాలి.

NOTE:

లింక్ పై క్లిక్ డైరెక్ట్ గా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9393711110, 9391005006 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. support@tslprb.in కు మెయిల్ పంపించి కూడా సహాయాన్ని పొందవచ్చని బోర్డు స్పష్టం చేసింది.