తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Minister Ktr Questions Indigo Airlines For Discrimination

KTR Questions Indigo : తెలుగు వచ్చిన వారినే అటెండెంట్లుగా పెట్టుకోండి….

B.S.Chandra HT Telugu

19 September 2022, 9:30 IST

    • KTR Questions Indigo ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భాష రాని కారణంగా ఓ మహిళపై వివక్ష చూపడాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ నెల 16వ తేదీన  విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తున్న విమానంలో ప్రయాణికురాలిని బలవంతంగా సీటు మార్చడంపై  సహ ప్రయాణికురాలు ట్వీట్ చేయడంతో కేటీఆర్‌ ఇండిగో సంస్థ తీరును ప్రశ్నించారు. దీంతో ట్వీట్ వైరల్‌గా మారింది. 
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో) (twitter)

మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)

భద్రతా కారణాలతో ఇంగ్లీష్‌ , హిందీ రాని ఓ మహిళా ప్రయాణికురాలిని ఫ్లైట్ అటెండెంట్‌ ఆమెకు రిజర్వ్‌ అయిన సీటు నుంచి మరో స్థానంలోకి బలవంతంగా మార్చడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ KTR Questions Indigo విమానయాన సంస్థ తీరును ప్రశ్నించడంతో ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

KTR Questions Indigo డియర్‌ ఇండిగో మేనేజ్‌మెంట్‌, ప్రాంతీయభాషల్ని గౌరవించాలని, విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ హిందీ, ఇంగ్లిష్‌ భాషలు రాకపోవచ్చన్నారు. విమానంలో ప్రయాణించే ప్రతిఒక్కరికి ఇంగ్లీష్‌, హిందీ భాషా పరిజ్ఞానం ఉండకపోవచ్చని, ప్రజలంతా అయా భాషల్లో మాట్లాడలేరన్నారు. స్థానిక భాషలను గౌరవించాలని, స్థానిక భాషలు మాట్లాడే సిబ్బందిని విమానాల్లో నియమించుకావాలని సూచించారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ వచ్చే సిబ్బందిని ప్రాంతీయ విమానాలలో సిబ్బందిగా నియమించుకోవడం ద్వారా అందరికి అమోదయోగ్యంగా ఉంటుందని సూచించారు.

తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, మునిసిపల్‌ శాఖల మంత్రి కేటీ రామారావు ఓ ట్వీట్‌ను ఉటంకిస్తూ రీట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ప్రముఖ ఎకానమీ విమానయాన సంస్థ ఇండిగోకు కేటీఆర్ ఈ సూచన చేశారు.

ఏం జరిగిందంటే…..

KTR Questions Indigoఈ నెల 16న ఇండిగో6ఇ విమానంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ ప్రయాణిస్తున్న ఓ మహిళ తెలుగు మాత్రమే మాట్లాడుతోందని, ఆమెకు హిందీ లేదా ఇంగ్లిష్‌ రాదనే కారణంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వద్ద నుంచి బలవంతంగా ఆమెను మరో సీటుకు మార్చారు. 2ఏ (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ వద్ద ఉండే విండో సీట్‌)లో కూర్చున్న ఆమె వల్ల అత్యవసర పరిస్థితుల్లో ‘భద్రతకు ముప్పు’గా పరిగణించి ఆమె సీటును మార్చారు. ఆమెకు రిజర్వ్‌ చేసిన సీటుకు బదులు 3సీ(కిటికీ నుంచి మూడో సీటు) కేటాయించారు. ఈ తతంగం మొత్తాన్ని గమనించిన అదే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ప్రొఫెసర్‌ ఒకరు ఇండిగో సిబ్బంది తీరును తప్పు పడుతూ ట్వీట్‌ చేశారు.

తెలుగు మహిళ కూర్చున్న స్థానాన్ని బలవంతంగా మార్చడంతో ఎదురు సీటులో కూర్చున్న ఐఐఎం-అహ్మదాబాద్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ దేవస్మిత చక్రవర్తి సోషల్‌ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ‘‘తెలుగు రాష్ట్రాల మధ్య విమానాలు నడుపుతూ, తెలుగు రాని సిబ్బందిని నియమించి.. తెలుగు మాట్లాడేవారిని వివక్షకు గురిచేయడమేనని ఆరోపించారు. బాధిత మహిళ ఫొటోను కూడా షేర్‌ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌ పైవిధంగా స్పందించారు. కొందరు నెటిజన్లు ఇండిగో సిబ్బంది చర్యను ‘సెక్యూరిటీ’ పేరుతో సమర్థించగా, చాలా మంది ఆ సంస్థ తీరును తప్పు పట్టారు. ప్రయాణికుల విషయంలో ఇండిగో తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టాపిక్