తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Komuravelli Mallanna Kalyanam : 'కోర మీసాల మల్లన్నకు' రూ. కోటి స్వర్ణ కిరీటం

Komuravelli Mallanna Kalyanam : 'కోర మీసాల మల్లన్నకు' రూ. కోటి స్వర్ణ కిరీటం

18 December 2022, 22:00 IST

Komuravelli Mallanna Kalyanam 2022: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలతోపాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.

  • Komuravelli Mallanna Kalyanam 2022: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలతోపాటు రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని సమర్పించారు.
కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. 
(1 / 6)
కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. (twitter)
 కొమురవెల్లి మల్లన్నకు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి వెలువైన బంగారు కిరీటాన్ని సమర్పించింది.   
(2 / 6)
 కొమురవెల్లి మల్లన్నకు తెలంగాణ ప్రభుత్వం రూ. కోటి వెలువైన బంగారు కిరీటాన్ని సమర్పించింది.   (twitter)
ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు పట్టువస్త్రాలతో పాటు బంగారు కీరిటాన్ని ఆలయ అర్చకులకు అందించారు.
(3 / 6)
ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు పట్టువస్త్రాలతో పాటు బంగారు కీరిటాన్ని ఆలయ అర్చకులకు అందించారు.(facebook)
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావ్ మాట్లాడుతూ.. మల్లన్న ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.30కోట్లు కేటాయించారన్నారు.  కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలో జాతర అంటే.. మల్లన్న జాతరేనన్న మంత్రి.. వచ్చే ఏడాది మేడమ్మకు, ఖేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు.   
(4 / 6)
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావ్ మాట్లాడుతూ.. మల్లన్న ఆలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.30కోట్లు కేటాయించారన్నారు.  కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణలో జాతర అంటే.. మల్లన్న జాతరేనన్న మంత్రి.. వచ్చే ఏడాది మేడమ్మకు, ఖేతమ్మకు సైతం బంగారు కిరీటాలను చేయిస్తామని ప్రకటించారు.   (facebook)
కొమురవెల్లి మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది.  ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణం జరిగింది. ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువుల మేడలాదేవి, కేతమ్మదేవీ తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపించారు. 
(5 / 6)
కొమురవెల్లి మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది.  ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణం జరిగింది. ఆలయ సంప్రదాయం మేరకు వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు, వధువుల మేడలాదేవి, కేతమ్మదేవీ తరఫున మహదేవుని వంశస్తులు పాల్గొని కల్యాణాన్ని జరిపించారు. (facebook)
రెండు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవంలో సోమవారం (డిసెంబర్ 19)ఉదయం 9 గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.   
(6 / 6)
రెండు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవంలో సోమవారం (డిసెంబర్ 19)ఉదయం 9 గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.   (facebook)

    ఆర్టికల్ షేర్ చేయండి