తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్.. మళ్లీ విధుల్లోకి..

Telangana Govt : ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్.. మళ్లీ విధుల్లోకి..

HT Telugu Desk HT Telugu

10 August 2022, 18:16 IST

    • తెలంగాణలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మ‌ళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాల‌ని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. ఈ మేరకు క‌లెక్టర్లు, జిల్లా అధికారుల‌కు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశాలు జారీ చేశారు. గ‌తంలో ప‌ని చేసిన చోటే 7,305 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల విధులు నిర్వర్తిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

2007 ఫిబ్రవ‌రిలో 7,561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్పుడు.. రూ.1,200 జీతంతో విధుల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత.. రూ. 10వేల జీతాలు ఇచ్చారు. ఉపాధి హామీ కూలీల మ‌స్టర్ రోల్స్ రాయ‌డం, ఉపాధి ప‌నుల‌ను ప‌ర్యవేక్షించడం లాంటి పనులు చేసేవారు. ఆ తర్వాత జాబ్ కార్డులు ఉన్నవాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందికి ఉపాధికి వచ్చే విధంగా చూడాలని అధికారులు అదేశించారు. విధుల్లో తప్పనిస‌రిగా ఉండాల‌ని ఆదేశించారు.

త‌మ‌ను ప‌ర్మినెంట్ చేయాల‌ని, తదితర డిమాండ్లతో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం.. 2021 మార్చిలో ఫీల్డ్ అసిస్టెంట్లను తాత్కాలికంగా పక్కన పెట్టింది. అప్పటి నుంచి వారు.. నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సుమారు 15 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. తమను శాశ్వత ప్రాతిపదికన నియమించి వేతనాలు పెంచాలనే డిమాండ్‌ చేశారు. సుమారు.. 7,700 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు 2020 మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ప్రభు త్వం లిస్ట్ 1, 2, 3గా విభజించి జీవో నెం. 4779 ద్వారా కొత్త ఉత్తర్వులు ఇచ్చింది. పని దినాల ఆధారంగా.. వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 దినాలు పని కల్పించిన వారికి రూ.10వేలు, 20 నుంచి 29 రోజులు పని కల్పించిన వారికి రూ.9వేలు, 10నుంచి 19 రోజులు పని కల్పించిన వారికి రూ.7,500 నెలకు చెల్లించారు. ఈ కారణంగా ఫీల్డ్ అసిస్టెంలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ప్రభుత్వం పక్కనపెట్టింది. అప్పటి నుంచి నిరసనలు తెలిపారు ఫీల్డ్ అసిస్టెంట్లు. చాలాసార్లు మంత్రి ఎర్రబెల్లిని కలిసి విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లోనూ.. నామినేషన్ వేస్తామని అనేక మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత.. పనిలోకి తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.