తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Governor Tamilisai - Cm Kcr: అసెంబ్లీకి గవర్నర్... స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

Governor Tamilisai - CM KCR: అసెంబ్లీకి గవర్నర్... స్వాగతం పలికిన సీఎం కేసీఆర్

03 February 2023, 15:15 IST

Telangana Assembly Budget session 2023: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ యథాతథంగా చదివారు. గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకుండా సాగింది. పూర్తిగా రాష్ట్ర ప్రగతిని వివరించారు.

  • Telangana Assembly Budget session 2023: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ యథాతథంగా చదివారు. గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేకుండా సాగింది. పూర్తిగా రాష్ట్ర ప్రగతిని వివరించారు.
తెలంగాణ  బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. 
(1 / 4)
తెలంగాణ  బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. (twitter)
సభలో ఆసీనులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం.. గవర్నర్ ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం ఆలపించారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 
(2 / 4)
సభలో ఆసీనులైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్ కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం.. గవర్నర్ ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం ఆలపించారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. (twitter)
నిజానికి రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఈ పరిణామంలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక  ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ ప్రసంగానికి అంగీకరించింది. ఫలితంగా బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది.
(3 / 4)
నిజానికి రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. గతేడాది గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఈ పరిణామంలో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక  ఈ ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ ప్రసంగానికి అంగీకరించింది. ఫలితంగా బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది.(twitter)
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం మారిందని… పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోందని చెప్పారు. “కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం” అంటూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది.
(4 / 4)
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం మారిందని… పచ్చదనంలో ప్రపంచ దేశాల ప్రశంసలు పొందుతోందని చెప్పారు. “కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం” అంటూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది.(twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి