తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 17 Telugu News Updates : త్వరలో గిరిజన బంధు - సీఎం కేసీఆర్
బంజారా భవన్ ప్రారంభ వేడుకలో సీఎం కేసీఆర్
బంజారా భవన్ ప్రారంభ వేడుకలో సీఎం కేసీఆర్ (HT)

September 17 Telugu News Updates : త్వరలో గిరిజన బంధు - సీఎం కేసీఆర్

17 September 2022, 22:05 IST

  • సెప్టెంబర్ 17 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

17 September 2022, 22:05 IST

స్టూడెంట్ సూసైడ్…. 

లోన్ యాప్ వేధింపులకు ఓ బీటెక్ విద్యార్థి బలయ్యాడు. ఈ ఘటన ఏపీలోని నంద్యాల వెలుగు చూసింది. వీరేంద్రనాథ్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు లోన్ చెల్లించాలని వీరేంద్రనాథ్‌పై లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లోన్ యాప్ నిర్వాహకులు అసభ్యకర ఫోటోలు పంపినట్లు సమాచారం. మృతిపై పోలీసుల దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

17 September 2022, 21:42 IST

ఈటల ఇంటికి అమిత్ షా,

బీజేపీ సీనియర్​ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా.. శనివారం మధ్యాహ్నం శామీర్ పేటలోని ఈటల రాజేందర్​ నివాసానికి వెళ్లారు.

17 September 2022, 19:51 IST

ఎంఈవో ఉద్యోగాలు… 

విద్యాశాఖకు సంబంధించిన ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఎంఈవో 2 పోస్టులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఈవో-1 పేరిట 13 పోస్టులు, ఎంఈవో-2 పేరిట 679 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 666 ఎంఈవో పోస్టులకు అదనంగా 13 కొత్త పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే 679 ఎంఈఓ 2 పోస్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక నుంచి ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఈవోలు విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న మండల విద్యాధికారి పోస్టును ఇక నుంచి ఎంఈవో - 1 గా మార్పు చేశారు.

17 September 2022, 18:31 IST

మరో పథకం - కేసీఆర్

త్వరలోనే గిరిజన బంధును తీసుకువస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను ఇస్తామని చెప్పారు.

17 September 2022, 17:58 IST

ఇంజినీరింగ్ విద్యార్థి బలి

లోన్ యాప్ వేధింపులు భరించలేక నంద్యాలకు చెందిన వీరేంద్రనాథ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

 

17 September 2022, 17:57 IST

నలుగురు కేటుగాళ్లు అరెస్ట్

ఒక్క క్లిక్ తో రుణాలు అంటూ ప్రజలను మోసం చేసి వేధిస్తున్న 2 కేసులలో 4 కేటుగాళ్లను కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేటుగాళ్లు పన్నిన వలలో చిక్కుకొని జీవితాలను బలికానివ్వద్దని సూచించారు. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

17 September 2022, 16:41 IST

మునుగోడులో ఇంటింటి ప్రచారం

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. చండూరు (మం)తుమ్మలపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గడప గడపకూ తీసుకెళ్తానని చెప్పారు. బిజెపి,టీఆరెఎస్ పార్టీలకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మునుగోడు గడ్డ ఆడబిడ్డగా తనను అంతా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశార.

17 September 2022, 16:24 IST

దసరా ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులపై దృష్టిపెట్టింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్‌ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని రంగారెడ్డి రీజయన్‌ నుంచి దాదాపు 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్‌గా జిల్లాలకు నడిపించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.

17 September 2022, 15:03 IST

భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీలకు కేటాయించిన భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. బంజారాలకు రూ.21.71కోట్లతో సంత్‌ సేవాలాల్‌, ఆదివాసీలకు రూ.21.50కోట్లతో కుమురంభీం భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... బంజారాహిల్స్‌లో గతంలో బంజారాలకు చోటులేకుండా పోయిందన్నారు. సొంత రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం కోసం జాతి మొత్తానికి తెలిసేలా ఈ భవనాన్ని నిర్మించుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. త్వరలోనే గిరిజనులకు సంబంధించి పోడుభూముల సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

17 September 2022, 14:22 IST

రైళ్లు రద్దు…

భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్ 18వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది.

ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి - సికింద్రాబాద్, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

17 September 2022, 13:34 IST

బీజేపీ ముఖ్య నేతలతో  అమిత్ షా భేటీ

బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. 19మంది ముఖ్యనేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ అయిన వారిలో బీజేపీ స్టేట్ చీఫ్ బండిసంజయ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వివేక్ వెంకటస్వామి, అర్వింద్, రఘునందన్ రావు, రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ హాజరయ్యారు. మునుగోడు ఉపఎన్నిక, పార్టీ బలోపేతం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్ చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారి ముఖ్యనేతలతో సమావేశమై  దిశానిర్దేశం చేశారు.

17 September 2022, 12:25 IST

మూడు రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

 

అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.  రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న ఏపీ సర్కార్ అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని  ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు విజ్ఞప్తి చేసింది.  సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.,  అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని పిటిషన్‍లో పేర్కొంది.  హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 

17 September 2022, 11:53 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా అమర వీరులందరికీ పేరు పేరునా తలచుకోవడం మన బాధ్యత అని వారందరి స్మృతిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు.

17 September 2022, 10:39 IST

నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పీకే

 దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అజేయ రాజకీయ విజయుడు నరేంద్ర మోదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.  సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన  సామాన్యుడు అసామాన్యమైన భారతదేశపు ప్రధాన మంత్రిగా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో మనం ఊహించవచ్చని అభినందించారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగొందాలని కోరుకుంటు,  మోదీకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధించారు. 

17 September 2022, 9:54 IST

తెలంగాణలో జాతీయ  సమైక్యతా దినోత్సవాలు

తెలంగాణలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్‍కు నివాళి అర్పించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండా ను స్పీకర్ పోచారం ఆవిష్కరించారు. మండలిలో  గుత్తా సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు.

17 September 2022, 9:54 IST

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది.  అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపలికు  క్యూలైన్లు వచ్చాయి.  సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు  లభించింది.  శ్రీవారిని దర్శించుకున్న 67,425 మంది భక్తులు దర్శించుకున్నారు. 

17 September 2022, 9:54 IST

ఆరో రోజు పాదయాత్ర….

 రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆరో రోజుకు చేరింది.  నేడు ఐలవరం నుంచి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. - కనగాల, రాజవోలు, తూర్పుపాలెం మీదుగా నగరం వరకు  పాదయాత్ర కొనసాగనుంది

17 September 2022, 9:54 IST

హైదరాబాద్‌‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినం

ఎందరో ప్రాణత్యాగాలతో హైదరాబాద్‌ సంస్థానం భారత రాజ్యంలో విలీనమైందని కర్ణాటక మంత్రి శ్రీరాములు అన్నారు. సికింద్రబాద్ పేరెడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవంలో  పాల్గొన్న శ్రీరాములు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన  13 నెలల తర్వాత కర్ణాటకలోని బీదర్, తెలంగాణ ప్రాంతాలకు, మరాట్వాడా ప్రాంతాలకు విముక్తి లభించిందని గుర్తు చేశారు. 

    ఆర్టికల్ షేర్ చేయండి