తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana And Andhrapradesh Telugu Live News Updates On 5 October 2022
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు (twitter)

Telugu News Updates 5th October: బీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?

05 October 2022, 22:41 IST

  • Today Telugu News Updates: అక్టోబర్ 05 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

05 October 2022, 22:41 IST

మునుగోడులో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ నుంచి ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ చేయనున్నారు. హైదరాబాద్‌ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత కేఏ పాల్‌ వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గద్దర్‌ చెప్పారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

05 October 2022, 22:39 IST

ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల చివరిరోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. యాగశాలలో పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. వర్షంతో కృష్ణానదిలో జరగాల్సిన దుర్గమల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవం రద్దు చేశారు.

05 October 2022, 22:38 IST

పండగపూట విషాదం

సత్యసాయి జిల్లా అమరాపురంలో విషాదం జరిగింది. నంజుండేశ్వర అనే వ్యక్తి స్నానం గదిలోని గీజర్​కు గ్యాస్ పైప్ అమర్చుతున్నాడు. ఇదే సమయంలో కనెక్షన్ ఊడిపోయి.. మంటలు చెలరేగాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి.. మరణించాడు.

05 October 2022, 22:36 IST

కేసీఆర్ దూరదృష్టి గల నేత: నిఖిల్ గౌడ

కేసీఆర్ గొప్ప దూరదృష్టి గల నేత అని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ అన్నారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించిన సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. భారత్​ రాష్ట్ర సమితితో కలిసి జేడీఎస్ పనిచేస్తుందన్నారు. సీఎంగా కేసీఆర్ తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్నారన్నారు.

05 October 2022, 22:34 IST

హైదరాబాద్​లో భారీ వర్షం

హైదరాబాద్​లో భారీ వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, దోమలగూడ, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌, గౌతమ్‌నగర్‌, కేపీహెచ్‌బీ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి​ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది.

05 October 2022, 14:31 IST

రుణం తీరిపోయింది: రేవంత్ రెడ్డి

'కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో.. ఆర్థికంగా బలోపేతమయ్యారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ చంపేశారు. తెలంగాణలో తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కు రుణం తీరిపోయింది.' రేవంత్ రెడ్డి అన్నారు.

05 October 2022, 14:29 IST

కేసీఆర్ పై ఈటల కామెంట్స్

'ఉద్యమ పార్టీని కతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేసి కెసిఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారు. ఆ పార్టీస్థాపనతోనే తెలంగాణాకి కెసిఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం తెగిపోయింది. తెలంగాణఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కెసిఆర్ కి ఉన్న బంధం తెగిపోయింది.' ఈటల రాజేందర్ అన్నారు.

05 October 2022, 13:37 IST

బీఆర్ఎస్ గా టీఆర్ఎస్….. 

టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ మేరకు ప్రవేశపెట్టిిన తీర్మానం ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన చేశారు.

05 October 2022, 13:29 IST

తీర్మానం…. 

జాతీయ పార్టీ కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ 6 మంది ఎమ్మెల్యేలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో కేసీఆర్‌ వివరించారు. తెలంగాణ భవన్‌లో కీలక భేటి కొనసాగుతోంది.

05 October 2022, 13:25 IST

టీఆర్ఎస్ గూటికి ఓదెలు…

నల్లాల ఓదెలు... చెన్నూరు మాజీ ఎమ్మెల్యే...! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయనకు 2018లో టికెట్ దక్కలేదు. అప్పట్నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన...కొద్దిరోజుల కిందట రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన భార్య మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆమె కూడా హస్తం గూటికి చేరారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఓదెలు. ఆయన తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరిగి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యారు. మంత్రి కేటీఆర్‌ ఓదెలు దంపతులకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 2009, 2014లో టీఆర్‌ఎస్‌ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు గెలుపొందారు. 2018లో ఈ స్థానం నుంచి విద్యార్థి నేత బాల్క సుమన్ కు టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినప్పటికీ.. ఎమ్మెల్సీ ఇస్తారనే హామీతో ఓదెలు కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోవటంతో... కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

05 October 2022, 13:08 IST

కొనసాగుతున్న భేటీ…. 

కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ని ప్రకటించనున్నారు.

05 October 2022, 13:06 IST

డేటింగ్ యాప్ తో వలపు వల…

ఢిల్లీ డేటింగ్ ఫ్రాడ్ కేసులో ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అరుణ్ గా గుర్తించారు. Gigolo Playboy సర్వీస్ డేటింగ్ పేరుతో పలువురిని మోసం చేసినట్లు తేల్చారు. 2020 నుంచి ఈ తరహా మోసాలకు పాల్పడుతూ 1,53,38,527 వరకు డబ్బులు రాబట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. అబ్బాయిలను వలలో వేసుకునేందుకు పలువురు అమ్మాయిలను రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు.

05 October 2022, 12:06 IST

స్పెషల్ ట్రైన్స్…. 

సికింద్రాబాద్ - నర్సాపూర్ మధ్య అక్టోబర్ 6వ తేదీన, నర్సాపూర్ - వికారాబాద్ మఝ్య అక్టోబర్ 7వ తేదీన స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. సికింద్రాబాద్ - నర్సాపూర్ రైలు రాత్రి 10.35 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఇది పెద్దపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనల్, విజయవాడ, గుడివాడ, అకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపూర్ స్టేషన్లలో ఆగుతుంది.

05 October 2022, 11:48 IST

సర్వసభ్య సమావేశం

 టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

05 October 2022, 11:48 IST

కాసేపట్లో టీఆర్ఎస్ సమావేశం

కాసేపట్లో టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది.ఈ భేటీకి జేడీఎస్ తో పాటు పలు ప్రాంతీయ పార్టీ నేతలు హాజరయ్యారు. ఇవాళ కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

05 October 2022, 11:31 IST

కాంగ్రెస్ కు షాక్…. 

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

05 October 2022, 10:25 IST

ఈ- స్కూటర్లు 

రాష్ట్ర పరిధిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో అందించేలా ఉత్తర్వులు జారీ చేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్‌ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

05 October 2022, 9:59 IST

ఈసీకి బీజేపీ వినతి

మునుగోడు ఉప ఎన్నికను కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది. హైదరాబాద్‌ బుద్ధభవన్‌లో ప్రధాన ఎన్నికల అధికారిని ఆ పార్టీ ప్రతినిధులు నల్లు ఇంద్రసేనారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, ప్రకాశ్‌రెడ్డి, ఆంటోని రెడ్డి కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు.

05 October 2022, 9:59 IST

ఫేక్ కాల్ సెంటర్ సీజ్… 

ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ ను గుట్టురట్టు చేశారు హైదరాబాద్ నగర పోలీసులు. అక్టోబర్ 4వ తేదీన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 1000 సిమ్ కార్డులు, 500 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

05 October 2022, 8:32 IST

భవానీ భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 10వ రోజు బుధవారం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు.  దుర్గమ్మను దర్శించేందుకు భవానీ భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

05 October 2022, 8:32 IST

టూర్ ప్యాకేజీ…. 

irctc tourism announced magical kerala tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. MAGICAL KERALAపేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. అలెప్పీ, కొచ్చి, మున్నార్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. అక్టోబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

05 October 2022, 8:09 IST

రెయిన్ అలర్ట్…

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా ఇవాళ, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

05 October 2022, 7:51 IST

నేడే బీఆర్ఎస్ ప్రకటన….

Today KCR Announced National Party: కేసీఆర్....ఈ పేరుకు కేరాఫ్ తెలంగాణ.! తెలంగాణ అంటే కేసీఆర్...!! మరోమాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్...! టీఆర్ఎస్ అంటే తెలంగాణ... !!కేవలం ప్రత్యేక రాష్ట్రమనే ఏకైక అజెండాతో పుట్టుకొచ్చిన పురుడు పొసుకున్న టీఆర్ఎస్.... 2 దశాబద్ధాలుకు పైగా రాడకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కేసీఆర్ దీక్ష తర్వాత తిరుగులేని పార్టీగా మారిన గులాబీ పార్టీ... అనుకున్నట్లు రాష్ట్రాన్ని సాధించటంలో అగ్రభాగాన నిలిచింది. కొత్త రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని పొంది అధికారపీఠంపై కొలువుదీరింది. బలమైన ఉద్యమ, రాజకీయ నేపథ్యంగా పేరొందిన తెలంగాణ రాష్ట్ర సమితి... రూపాంతరం చెందబోతుంది.

05 October 2022, 7:13 IST

ప్రాథమిక హక్కు కాదు…

 ఎన్నికల్లో నామినేషన్‌ తిరస్కరణపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైకోర్టులో వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని  స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేయడం చట్టబద్ధ హక్కు మాత్రమేనని, ప్రాథమిక హక్కు కిందికి రాదని  తెలిపింది.

05 October 2022, 7:12 IST

అరెస్ట్ చేయండి….

హోటల్ నిర్వాహకురాలు పై శ్రీకాళహస్తి సీఐ దురుసుగా ప్రవర్తించడాన్ని జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ధనలక్ష్మిపై దాడి చేసిన పోలీసులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని.. డీజీపీని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు.

    ఆర్టికల్ షేర్ చేయండి