తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  December 1 Telugu News Updates: ఏఎస్ఐ మోహన్ రెడ్డి సర్వీస్ నుండి తొలగింపు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు
ఏపీ తెలంగాణ తాజా వార్తలు

December 1 Telugu News Updates: ఏఎస్ఐ మోహన్ రెడ్డి సర్వీస్ నుండి తొలగింపు

01 December 2022, 22:56 IST

  • లిక్కర్ స్కామ్ లో అమిత్‌ అరోరాను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్‌ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది ఈడీ. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె.కవిత పేరు బయటకొచ్చింది. దక్షిణాది గ్రూప్‌ నుంచి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు లంచాలు అందాయని వెల్లడించింది. ఎక్సైజ్‌ అధికారులకు రూ.కోటి లంచం అందించడంలోనూ విజయ్‌నాయర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దక్షిణాది గ్రూపును శరత్‌చంద్రారెడ్డి, కె.కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని పేర్కొంది.  ఏయే రోజుల్లో సదరు ఫోన్‌ వినియోగించారనేది ఐఎంఈఐ నంబర్‌ సహా స్పష్టం చేసింది. మరిన్ని తాజా వార్తల అప్డేట్స్ కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి…. 

01 December 2022, 22:56 IST

రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు..

పోలవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లనివ్వడం లేదని..పోలీసులను ప్రశ్నించారు. కాసేపు వాగ్వాదంతో అక్కడే బైఠాయించి.. నిరసన తెలిపారు.

01 December 2022, 22:54 IST

ఏఎస్ఐ మోహన్ రెడ్డి సర్వీస్ నుండి తొలగింపు

కరీంనగర్ జిల్లా ఏఎస్ఐ మోహన్‌రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించారు. అక్రమ వడ్డీ వ్యాపారం ఇతర దందాల నేపథ్యంలో అధికారులు విచారణ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతడిపై చాలా కేసులు నమోదయ్యాయి.

01 December 2022, 16:59 IST

సీఎం జగన్​ను కలిసిన కొత్త సీఎస్​ జవహర్​రెడ్డి

ఏపీ నూతన సీఎస్.. కేఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

01 December 2022, 13:11 IST

గ్రీన్ సిగ్నల్… 

ts govt green signal to 3897 vacancies: ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాగా.. తాజాగా మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3897 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావ్ ట్వీట్ చేశారు. 9 మెడికల్ కాలేజీల్లో 3897 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆరోగ్య తెలంగాణకు పెద్ద బూస్టింగ్ వంటిందని ట్వీట్ చేశారు.

01 December 2022, 12:22 IST

సీబీఐ ముందుకు మంత్రి… 

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌, రాజ్యసభ ఎంపీ గాయత్రి రవి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్‌ కేసులో వీరిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు. 

01 December 2022, 12:21 IST

ముగ్గురికి బెయిల్…. 

ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులు నందు, సింహయాజీ, రామచంద్ర భారతీలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని పేర్కొంది. ఒక్కొక్కరు రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని ఆదేశించింది.

01 December 2022, 10:34 IST

ఎమ్మెల్సీ కవిత రియాక్షన్…. 

Kavitha Name In Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టిస్తోంది. అయితే దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు రావటంపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు.

మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని కవిత ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని కాబట్టే ఈడీ, ఐటీ, సీబీఐలు వస్తున్నాయని చెప్పారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటిచారు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. చిల్లర రాజకీయాలను మానివేయాలని మోదీని కోరారు.

"దేశంలోకి బీజేపీ పాలన వచ్చి ఎనిమిది ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ ఎనిమిది ఏళ్లలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజం. ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం కామన్. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతాం. ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదు. జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పంధాన్ని మార్చుకోవాలి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు" అని కవిత అన్నారు.

01 December 2022, 9:58 IST

గుజరాత్​ పోలింగ్.. 

గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 4.92 శాతం ఓటింగ్ నమోదైంది. మరో వైపు 100 ఏళ్ల వృద్ధురాలు ఓటేసి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. ఉమర్​గామ్​కు చెందిన కముబెన్​ పటేల్​ అనే వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.

01 December 2022, 8:35 IST

సీఎం జగన్ టూర్… 

ఇప్పటికే పలు జిల్లాలకు వెళ్లిన సీఎం జగన్... ఇక సొంత జిల్లా(కడప)కు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా టూర్ షెడ్యూల్‌ ఖరారైంది. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

రేపటి షెడ్యూల్ ..

డిసెంబర్‌ 2న ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు.

01 December 2022, 8:04 IST

తీపి కబురు…. 

TSRTC Latest News: విద్యార్థుల కోసం ఈ మధ్యే కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఐటీ ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ఈ బస్సు ఎక్కి నేరుగా తమ ఆఫీస్‌ దగ్గరకి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా విధులు ముగించుకుని ఆఫీస్‌ దగ్గర బస్సు ఎక్కి ఇంటి దగ్గర దిగవచ్చు.

01 December 2022, 7:35 IST

బోర్డు నిర్ణయాలు… 

టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం జరిగిన భేటీ అనంతరం వివరాలను వెల్లడించింది. శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

01 December 2022, 7:11 IST

36 మంది పేర్లు…. 

లిక్కర్ కేసులో తాజాగా దాఖలు చేసిన ఛార్జీషీట్ లో మొత్తంగా 36 మంది (నిందితులు/అనుమానితులు) ఫోన్‌ నంబర్ల వివరాలను రిపోర్టులో పేర్కొంది ఈడీ. ఈ 36 మంది 170 ఫోన్లు వినియోగించి వాటిని ధ్వంసం చేశారని తెలిపింది. ఈ ఫోన్ల విలువ రూ.1.38 కోట్లు ఉంటుందని పేర్కొంది. 2022, సెప్టెంబర్‌ 23 వరకూ ఆయా ఫోన్లు వినియోగించారని తెలిపింది.

01 December 2022, 7:08 IST

ప్రముఖల పేర్లు… 

లిక్కర్ స్కామ్ లో అమిత్‌ అరోరాను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తూ రిమాండ్‌ రిపోర్టును ధర్మాసనానికి అందజేసింది ఈడీ. ఈ రిపోర్టు ద్వారా తొలిసారిగా ఎమ్మెల్సీ కె.కవిత పేరు బయటకొచ్చింది. దక్షిణాది గ్రూప్‌ నుంచి విజయ్‌నాయర్‌కు రూ.100 కోట్లు లంచాలు అందాయని వెల్లడించింది. ఎక్సైజ్‌ అధికారులకు రూ.కోటి లంచం అందించడంలోనూ విజయ్‌నాయర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దక్షిణాది గ్రూపును శరత్‌చంద్రారెడ్డి, కె.కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని పేర్కొంది. ఏయే రోజుల్లో సదరు ఫోన్‌ వినియోగించారనేది ఐఎంఈఐ నంబర్‌ సహా స్పష్టం చేసింది. మరిన్ని తాజా వార్తల అప్డేట్స్ కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి….

01 December 2022, 7:08 IST

షర్మిలపై టీఆర్ఎస్ ఆరోపణలు… 

TRS Leaders Fires On YS Sharmila: వైఎస్ షర్మిల... ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్..! ప్రజాప్రస్థానం పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఆమె... పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశారు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే ఆమె యాత్ర కొనసాగుతూ వచ్చింది. సీన్ కట్ చేస్తే... నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో కంప్లీట్ గా పరిస్థితి మారిపోయింది. ఏకంగా వైఎస్ఆర్టీపీకి చెందిన ఓ బస్సునే తగలబెట్టే వరకు పరిస్థితి వచ్చింది. ఈ దాడిని ఖండిస్తూ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాడిలో పాడైన వాహనాలతోనే షర్మిల ప్రగతి భవన్‌ వైపు వెళ్లడం, ఆమె కారులో ఉండగానే.. పోలీసులు కారును లాక్కెళ్లడం.. అనంతరం అరెస్ట్ చేయడం.. వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం... ఓ రేంజ్ లోనే ఫైర్ అవుతున్నారు. ఇక నుంచి తగ్గేదేలే అని చెబుతున్నారు. ఇదే సమయంలో బీజేపీతో ముడిపెట్టి కార్నర్ చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్ షర్మిల పార్టీపై సరికొత్త చర్చ నడుస్తోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి