MLC Kavitha Plea : అరెస్ట్ పై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ - విచారణ తేదీ ఖరారు, ఏం జరగబోతుంది..?
20 March 2024, 12:23 IST
- MLC Kavitha Plea in Supreme Court: లిక్కర్ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి శుక్రవారం విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసు
MLC Kavitha Arrest in Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Excise Policy Case:) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్(MLC Kavitha) చేయటంతో… ఈడీ మరింత దూకుడు పెంచింది. కస్టడీ విచారణలో కీలక విషయాలను రాబట్టే పనిలో ఉంది. మరోవైపు తనని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈడీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఎమ్మెల్సీ కవిత… సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే అరెస్ట్ ఈడీ అరెస్ట్ చేసిందని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఉన్న పలువురి నిందితుల స్టేట్ మెంట్ల ఆధారంగా తనను అరెస్ట్ ఈడీ అరెస్ట్ చేసిందని ప్రస్తావించారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు రాకుండానే…. అరెస్ట్ చేసిందని కవిత గుర్తు చేశారు.ఈడీ చర్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని… ఈ కేసులో తన అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
శుక్రవారం విచారణ….
కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్(MLC Kavitha Plea in Supreme Court) సుప్రీంకోర్టులో లిస్ట్ అయింది. ఈ శుక్రవారం బెంచ్ ముందుకు రానుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుంద్రేశ్, బీఎం తివ్రేదిలతో కూడిన ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ జరపనుంది. ఇప్పటికే రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించినగా… సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంను మరోసారి ఆశ్రయించిన నేపథ్యంలో… కవితకు ఊరట దొరుకుతుందా..? లేక వేరే పరిణామాలు చోటు చేసుకుంటాయా అనేది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈ కేసులో కవితకు విధించిన రిమాండ్… మార్చి 23వ తేదీ ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి ఈడీ… రౌజ్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ వేస్తుందా…? మరోసారి కస్టడీకి కోరుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ఇంతకంటే ముందే సుప్రీంకోర్టులో విచారణ(మార్చి 22) జరగనున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం… ఏమైనా కీలక ఆదేశాలు ఇస్తే కేసు విచారణలో మరో మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో బోయినపల్లి అభిషేక్‌కు మధ్యంతర బెయిల్ జారీ అయింది. 5 వారాలపాటు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు అయింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉండటంతో బెయిల్ మంజూరు చేసింది. ఈడీ అధికారులకు ఫోన్ నెంబర్ ఇవ్వాలని అభిషేక్‌కు సుప్రీం ఆదేశించింది. పాస్ పోర్టును సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. సంబంధిత అధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించింది.
15వ తేదీన కవిత అరెస్ట్…
దిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే (Mlc Kavitha)కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.