ఆ రిట్ పిటిషన్ హైకోర్టు ముందుకు రావడం లేదు.. సీజేఐకి రఘునందన్ రావు లేఖ-bjp mla letter to cji justice nv ramana on writ petition over cs somesh kumar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆ రిట్ పిటిషన్ హైకోర్టు ముందుకు రావడం లేదు.. సీజేఐకి రఘునందన్ రావు లేఖ

ఆ రిట్ పిటిషన్ హైకోర్టు ముందుకు రావడం లేదు.. సీజేఐకి రఘునందన్ రావు లేఖ

HT Telugu Desk HT Telugu
Mar 14, 2022 04:42 PM IST

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై వేసిన రిట్ పిటిషన్.. హైకోర్టు ముందుకు రావడం లేదని.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు అన్నారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

<p>రఘునందన్ రావు(ఫైల్ ఫొటో)</p>
రఘునందన్ రావు(ఫైల్ ఫొటో)

సీఎస్ సోమేశ్‌ కుమార్‌పై ఐదేళ్ల కింద రిట్ పిటిషన్ వేసినా.. హైకోర్టు బెంచ్‌ ముందుకు ఎందుకు రావడం లేదని బీేపీ ఎమ్మె్ల్యే రఘునందన్‌రావు అన్నారు. కావాలనే.. విచారణకు రాకుండా తొక్కి పెడుతున్నది ఎవరు అని తెలియాలన్నారు. న్యాయస్థానం ముందురు రాకుండా ఎందుకు ఆపుతున్నారో తెలియాలన్నారు. ఈ విషయంపై విచారణ జరగాలని కోరుతూ.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.

సోమేశ్‌ కుమార్‌ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారి అని రఘునందన్‌రావు అంటున్నారు. మరో 12 మంది అధికారులు సైతం.. ఆంధ్రాకు కేటాయించిన అధికారులేనని పేర్కొన్నారు. అయిని నిబంధనలకు విరుద్ధంగా.. తెలంగాణలో కొనసాగుతున్నారని చెప్పారు.

Whats_app_banner