తెలుగు న్యూస్  /  Telangana  /  Southcentral Railway Extended 18 Special Trains Check Full Details Are Here

SCR Special Trains: ప్రయాణికులకు అలర్ట్... 18 ప్రత్యేక రైళ్ల పొడిగింపు, వెళ్లే రూట్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

07 January 2023, 7:20 IST

    • south central railway special trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తాజాగా మరికొన్ని ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

SCR Special Trains Latest: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇప్పటికే సంక్రాంతికి పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. తాజాగా పలు రూట్లలో నడుస్తున్న 18 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

రద్దీని దృష్టిలో పెట్టుకొని జనవరి, ఫిబ్రవరి నెలల్లో 18 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తిరుపతి నుంచి అకోలా రూట్‌లో ప్రతీ శుక్రవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.

హైదరాబాద్ నుంచి నర్సాపూర్ రూట్‌లో(రైలు నెంబర్ 07631 ) ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం ట్రైన్ (రైలు నెంబర్ 07632 ) అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది. ఇక హైదరాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 23 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది రైల్వే శాఖ. తిరుపతి నుంచి హైదరాబాద్ రూట్‌(రైలు నెంబర్ 07644)లో ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 24 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.

మరోవైపు విజయవాడ నుంచి నాగర్‌సోల్ రూట్‌లో ప్రతీ శుక్రవారం అందుబాటులో స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 24 వరకు పొడిగించింది. నాగర్‌సోల్ నుంచి విజయవాడ రూట్‌లో ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 25 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఇక కాకినాడ నుంచి లింగంపల్లి మార్గంలో ప్రతీ సోమవారం, బుధవారం, శుక్రవారం స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 20 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ రూట్‌లో ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 21 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.

మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ మార్గంలో ప్రతీ ఆదివారం ప్రత్యేక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలును 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం రూట్‌లో ప్రతీ ఆదివారం అందుబాటులో ఉండగా... ఈ ట్రైన్ ను 2023 జనవరి 22 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగించారు.తిరుపతి నుంచి సికింద్రాబాద్ రూట్‌లో ప్రతీ ఆదివారం స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉండగా... ఈ రైలును ఫిబ్రవరి 5 నుంచి 2023 ఫిబ్రవరి 26 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్‌లో ప్రతీ సోమవారం అందుబాటులో స్పెషల్ ట్రైన్ ఉండగా... ఈ రైలును 2023 ఫిబ్రవరి 6 నుంచి 2023 ఫిబ్రవరి 27 వరకు పొడిగించింది. ఇవే గాకుండా ఇతర మార్గాల్లో నడిచే రైళ్ల వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.