తెలుగు న్యూస్  /  Telangana  /  Sexual Harassment On Contract Employee In Medak District

Sexual Harassment: 'రాత్రి నాతో గడిపితేనే ఫైల్ పై సంతకం చేస్తా'

HT Telugu Desk HT Telugu

15 May 2022, 11:16 IST

    • కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని ఉన్నతాధికారి వేధించిన ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. చెప్పినట్లు వింటేనే కాంట్రాక్ట్ ను రెన్యూవల్ చేస్తానంటూ సదరు అధికారి వేధింపులకు దిగాడు. ఈ వ్యవహరం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కాంట్రాక్ట్ ఉద్యోగిణిపై లైంగిక వేధింపులు
కాంట్రాక్ట్ ఉద్యోగిణిపై లైంగిక వేధింపులు

కాంట్రాక్ట్ ఉద్యోగిణిపై లైంగిక వేధింపులు

sexual harassment on contract employee: ఐసీడీఎస్ లో ఆమె కింది స్థాయి మహిళా ఉద్యోగిని. అందులోనూ కాంట్రాక్ట్..! ప్రతి ఏడాది కాంట్రాక్ట్ ను రెన్యెూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే పని నిమిత్తం ఉన్నతాస్థాయి అధికారి వద్దకు వెళ్లింది. కానీ సీన్ రివర్స్ అయింది.. సదరు అధికారి నిర్వర్తించాల్సిన బాధ్యతలను పక్కనపెట్టి.. మరో కోణంలో చూశాడు. తనతో ఓ రాత్రి గడిపితేనే సంతకం పెడతానంటూ అనుచితంగా ప్రవర్తించాడు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

వివరాలు చూస్తే…

జయరాం నాయక్... ఐసీడీఎస్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌. ఇదే శాఖలో ఓ మహిళ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తోంది. ఈ క్రమంలో ప్రతీ సంవత్సరం మార్చి నెలతో కాంట్రాక్ట్‌ ముగుస్తుండటంతో మళ్లీ రెన్యూవల్‌ చేస్తారు. ఈ ఏడాది కూడా జాబ్ పొడగింపు కోసం లెటర్‌ పై సంతకం కావాలని సదరు మహిళ కోరింది. కానీ జయరామ్ నాయక్.. తనలోని మరో కోణాన్ని బయటికి తీశాడు. కోరిత తీరిస్తేనే సంతకమని తేల్చి చెప్పాడు. తనతో ఓ రాత్రి గడిపితే పని పూర్తి అవుతుందంటూ చెప్పటంతో బాధితురాలు షాక్ అయింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

మార్చి 30న జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సదరు అధికారి వ్యవహరశైలిపై అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

టాపిక్