తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Summer Special Trains: ప్రయాణికులకు అలర్ట్... కాచిగూడ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే

Summer Special Trains: ప్రయాణికులకు అలర్ట్... కాచిగూడ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు, టైమింగ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

20 May 2023, 7:20 IST

    • South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వాటి వివరాలు చూస్తే….
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరో రూట్ లో ప్రతిరోజూ సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా కాచిగూడ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. వేసవి రద్దీ దృష్ట్యా వీటిని నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాటి వివరాలు చూస్తే….

ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

కాచిగూడ నుంచి నర్సాపూర్(ట్రైన్ నెంబర్ 07654) మధ్య స్పెషల్ ట్రైన్ ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ మే 25వ తేదీన కాచిగూడ స్టేషన్ నుంచి రాత్రి 08.30 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.35 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఇక నర్సాపూర్ నుంచి కాచిగూడ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ మే 26వ తేదీన నర్సాపూర్ నుంచి సాయంత్రం 06 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు తెల్లవారుజామున 04.50 గంటలకు కాచిగూడ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు.... మల్కాజ్ గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏపీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Trains Cancellation: మరోవైపు కాజీపేట సెక్షన్‌లో పరిధిలో ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కాజీపేట-కొండపల్లి సెక్షన్ పరిధిలోని చింతపల్లి- నెక్కొండ రైల్వే స్టేషన్ల మధ్య ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టాల్సి ఉండటంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

రద్దైన రైళ్లు ఇవే….

ట్రైన్ నంబర్ 07753 కాజీపేట డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07754 డోర్నకల్ -కాజీపేట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07755 విజయవాడ-డోర్నకల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07756 డోర్నకల్ - విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07465 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను మే 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రైన్ నంబర్ 17660 భద్రాచలం రోడ్ - సికింద్రాబాద్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17659 సికింద్రాబాద్ - భద్రాచలం రోడ్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 12713 విజయవాడ-సికింద్రబాద్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్- విజయవాడ ఎక్స్ ప్రెస్ మే 21 నుంచి జూన్ 7వరకు రద్దు అయ్యింది. ట్రైన్ నంబర్ 07091 కాజీపేట తిరుపతి, ట్రైన్ నంబర్ 07092 తిరుపతి -కాజీపేట రైలును మే 23, 30, జూన్ 6 తేదీలలో రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 07185 మచిలీపట్నం-సికింద్రాబాద్, ట్రైన్ నంబర్ 07186 సికింద్రాబాద్-మచిలీపట్నం రలును మే 21, 28, జూన్ 4 తేదీలలో రద్దు చేశారు.