తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  No Petrol : అక్కడ ఆగస్టు 15 నుంచి 'నో హెల్మెట్, నో పెట్రోల్' రూల్

No Petrol : అక్కడ ఆగస్టు 15 నుంచి 'నో హెల్మెట్, నో పెట్రోల్' రూల్

HT Telugu Desk HT Telugu

11 August 2022, 19:40 IST

    • మీరు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్ వెళ్తున్నారా? అయితే మీకు పెట్రోల్ పోయరు. మీరు ఎంత సేపు వెయిట్ చేసినా.. నో యూజ్. ఇదేక్కడ అనుకుంటున్నారా? తెలంగాణలోనే.
నో హెల్మెట్.. నో పెట్రోల్
నో హెల్మెట్.. నో పెట్రోల్

నో హెల్మెట్.. నో పెట్రోల్

వరంగల్‌లో ఆగస్టు 15 నుంచి వినూత్న కార్యక్రమం అమలులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ పంపుల్లో ఇంధనం నింపుకొనేందుకు వెళ్తే పెట్రోల్‌ నింపరు. నిబంధనలు పాటించాలని పోలీసు కమిషనర్‌ పెట్రోల్‌ పంపు యజమానులకు/ పంప్‌ అటెండర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రమాదాల్లో మరణిస్తున్నందున ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమంపై వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీల పరిధిలోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 'నో హెల్మెట్, నో పెట్రోల్' అనే ఫ్లెక్సీలు/బ్యానర్‌లను ఏర్పాటు చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 426 మంది మరణించగా, 1,106 ప్రమాదాల్లో 1,110 మంది గాయపడ్డారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే.. వల్లే ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు మరణించారని తరుణ్ జోషి అన్నారు. ఐఓసీ, హెచ్‌పీ, బీపీసీఎల్‌ తదితర పెట్రోల్‌ బంకులకు ఇప్పటికే 150 బ్యానర్లు పంపిణీ చేశామని ట్రాఫిక్ ఏసీపీ తెలిపారు.

నవంబర్ 1, 2021 నుండి పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ధరించాలనే నిబంధనను పోలీసులు ఇప్పటికే అమలు చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు జరిమానా విధించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంటి దగ్గర కుటుంబాలు ఎదురుచూస్తాయని.. హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నో హెల్మెట్, నో పెట్రోల్ నిబంధనతో మార్పు వస్తుందని ఆశీస్తున్నారు.