తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Puvvada Ajay Review On Tsrtc

TSRTC Electric Buses : తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు

HT Telugu Desk HT Telugu

26 September 2022, 19:02 IST

    • Minister Puvvada Ajay Kumar : తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రవాణా శాఖలో ఆన్ లైన్ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రవాణా శాఖలో పౌర సేవలు, ఆన్​లైన్ సేవలు, ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష చేశారు. ఖైరతాబాద్‌ రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రవాణా శాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖలో ఆన్​లైన్ సేవలను మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తెవాల్సిన అవసరం ఉందన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sangareddy fake Documents: నకిలీ పత్రాలను సృష్టించి ఫ్లాట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

TSPSC Group 1 Exam Updates : ఓఎంఆర్‌ విధానంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - TSPSC ప్రకటన

TS SSC Supplementary: జూన్‌ 3 నుంచి తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్‌ టేబుల్ విడుదల

2 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

'రవాణా శాఖలో మరికొన్ని సేవలను ఆన్​లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలి. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది.

ఆర్టీసీ రోజువారి ఆదాయ, వ్యయాలపై మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న పనులను కొనియాడారు. రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.