దమ్ముంటే నాపై పోటీ చేయ్.. వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ సవాల్-minister puvvada ajay kumar open challenge to ys sharmila ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  దమ్ముంటే నాపై పోటీ చేయ్.. వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ సవాల్

దమ్ముంటే నాపై పోటీ చేయ్.. వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ సవాల్

HT Telugu Desk HT Telugu
Jun 17, 2022 04:33 PM IST

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీచేసి గెలవాలన్నారు. వైఎస్ హయాలంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

<p>మంత్రి పువ్వాడ అజయ్( ఫైల్ ఫొటో)</p>
మంత్రి పువ్వాడ అజయ్( ఫైల్ ఫొటో) (twitter)

Minister puvvada fiers on ys sharmila: వైఎస్ షర్మిలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరాచకాలను తెలంగాణ సమాజం మరిచిపోలేదన్నారు. శుక్రవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన... షర్మిల సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరంటూ ఎద్దేవా చేశారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని నిలదీశారు. పాదయాత్రలో భాగంగా ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల.. ఇటీవల పువ్వాడ అజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

షర్మిలకు దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు. పాలేరులో పోటీ చేసినా తన దమ్మేంటో చూపిస్తానని చెప్పుకొచ్చారు. ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు, దందాలు చేసిన ఘనత వైఎస్ కుటుంబానిదే అని ఆరోపించారు. వైఎస్ పాలనలో తుపాకీ తూటాలు పేలాయని విమర్శించిన ఆయన... మొద్దు శీనును జైల్లో చంపారని గుర్తు చేశారు. పని చేసిన వారినే గుర్తించే సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారని...ఒట్టి పుణ్యానికి ఇవ్వలేదని మంత్రి అజయ్ అన్నారు. అందుకు తాను ఎంతో గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.

షర్మిల ఏం అన్నారంటే...

పాదయాత్రలో భాగంగా మంత్రి అజయ్ పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఇదే ఖమ్మం పట్టణం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వేధింపులు తట్టుకోలేక .. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఖమ్మంలో నియంత పాలన జరుగుతుందని... ఒట్టి పుణ్యానికి మంత్రి కూడా అయ్యాడని వ్యాఖ్యానించారు. పువ్వాడ ఒక దిక్కుమాలిన మంత్రి అని, ఒక బ్లాక్ మెయిలర్ అంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మంత్రి పువ్వాడ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

Whats_app_banner