How to check EPF balance online : ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
How to check EPF balance online : ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం చాలా సులభం. ఈ కింద చెప్పినది పాటించండి.. మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోండి.
(1 / 5)
మీకు పీఎప్ ఖాతా ఉందా? అందులో బ్యాలెన్స్ చెక్ చేసుకున్నారా? పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్‌ని ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఉమంగ్ యాప్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు. (HT_PRINT)
(2 / 5)
ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం.. ఉమంగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ మీద క్లిక్ చేయండి. ‘వ్యూ పాస్‌బుక్’ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. యూఏఎన్ నెంబర్ టైప్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి.(REUTERS)
(3 / 5)
ఉమంగ్ యాప్ ద్వారీ పీఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే.. ముందుగా యాప్‌లోకి లాగిన్ అయ్యి, యూఏఎన్ టైప్ చేసి, ఓటీపీ టైప్ చేయాలి.(MINT_PRINT)
(4 / 5)
ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం.. 7738299899 కి ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ పంపాలి. అందులో చివరి మూడు అక్షరాలు భాషకు సంబంధించినది. తొమ్మిది భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.(Pixabay)
ఇతర గ్యాలరీలు