TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?-good news for tsrtc employees over september month da ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

TSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

Anand Sai HT Telugu
Aug 15, 2022 06:10 PM IST

పంద్రాగస్టు రోజున టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందజేశారు ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. సెప్టెంబర్ నెల జీతభత్యాల గురించి మాట్లాడారు.

<p>టీఎస్ఆర్టీసీ</p>
<p>టీఎస్ఆర్టీసీ</p>

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు మరో డీఏను అందిస్తామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే 1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 1932 నాటి 'డెక్కన్ క్విన్' అల్బినియన్ బస్సు గురించి ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్పారు.

హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రోడ్డు మార్గాలలో నిజాం కాలం నాటి బస్సును ప్రజల సందర్శనార్థం ప్రదర్శిస్తామన్నారు. 75వ భారత స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ బస్ భవన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. నిజాం రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన మాజీ ఉద్యోగులు నరసింహ, సత్తయ్యను ఈ సందర్భంగా సన్మానించారు. వారికి సన్మానం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.

'ఆర్టీసీ సంస్థ ఉద్యోగులందరికీ అండగా ఉంటాం. ఆర్టీసీలో BWS పథకం ద్వారా త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రానున్న రోజుల్లో 300 ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభిస్తున్నాం. కమర్షియల్ రెవెన్యూ కోసం అతి త్వరలోనే సొంత బ్రాండ్ తో ఆర్టీసీ ZIVA వాటర్ బాటిల్లను కూడా మెుదలవుతాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి 20 కోట్ల ఆదాయానికి కృషి చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు.' అని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.