తెలుగు న్యూస్  /  Telangana  /  Kendriya Vidyalaya Uppal Notification For Jobs Recruitment 2022

KV Jobs: ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు.. కేవలం ఇంటర్వూలతోనే భర్తీ

HT Telugu Desk HT Telugu

02 July 2022, 16:53 IST

  • Jobs in kendriya vidyalaya: కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఉప్పల్‌ (హైదరాబాద్)లోని కేంద్రీయ విద్యాలయ నెం.1 పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కేవలం ఇంటర్వూల ద్వారే వీటిని భర్తీ చేయనున్నారు.

ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు
ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు

ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయలో ఉద్యోగాలు

jobs in kendriya vidyalaya uppal: హైదరాబాద్ లోని ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అయితే ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వూల ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వాక్ ఇన్ ఇంటర్వూలను 04.07.2022 తేదీన నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

టీజీటీ - సోషల్‌ స్టడీస్‌, సంస్కృతం

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఆర్‌సీఈ (ఎన్‌సీఈఆర్‌టీ) నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సీటెట్‌ అర్హులై ఉండాలి. ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో టీచింగ్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

జీతం: నెలకు రూ.26500 చెల్లిస్తారు.

స్పోర్ట్స్‌ కోచ్‌...

అర్హత: డిగ్రీ/ డిప్లొమా (కోచింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత క్రీడలో ప్రొఫిషియన్సీ ఉండాలి.

జీతం: నెలకు రూ.21250 చెల్లిస్తారు.

ఎడ్యుకేషనల్‌ కౌన్సెలర్‌

అర్హత: బీఏ/ బీఎస్సీ (సైకాలజీ) ఉత్తీర్ణతతో పాటు సర్టిఫికెట్‌ డిప్లొమా (కౌన్సెలింగ్‌) చేసి ఉండాలి.

జీత: నెలకు రూ.25000 చెల్లిస్తారు.

స్పెషల్‌ ఎడ్యుకేటర్‌

అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు బీఈడీ/ డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత.

జీతం: నెలకు రూ.21250 చెల్లిస్తారు.

పై పోస్టులన్నీ కూడా వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 04.07.2022న కేంద్రీయ విద్యాలయ నెం.1, ఉప్పల్‌ వేదికగా నిర్వహించనున్నారు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

టాపిక్