తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr On Kejriwal Arrest : కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం, దేశ చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు - కేసీఆర్

KCR On Kejriwal Arrest : కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం, దేశ చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు - కేసీఆర్

22 March 2024, 19:47 IST

    • Delhi CM Arvind Kejriwal Arrest Updates: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ గా అభిప్రాయపడ్డారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Photo From BRS Twitter)

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR On Delhi CM Kejriwal Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్(Delhi CM Kejriwal Arrest) అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి పలు ప్రతిపక్ష పార్టీలు. కేజ్రీవాల్ అరెస్ట్ పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (BRS Chief KCR)కూడా స్పందించారు. అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని అన్నారు. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌న్నారు విమర్శించారు. ఇదే విషయాన్ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్ట్ (MLC Kavitha Arrest) ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటుందని కేసీఆర్ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

TS EdCET 2024 : టీఎస్ ఎడ్ సెట్ దరఖాస్తుల సవరణలకు అవకాశం, మే 15 చివరీ తేదీ!

Telangana Temples Tour : తెలంగాణ టెంపుల్స్ టూర్, 24 గంటల్లో 5 ప్రముఖ దేవాలయాల సందర్శన

10Years Telangana: కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు, ప్రవాస తెలంగాణ వాసుల సంబురాలు

Road Accident: ఓటేయడానికి వెళుతూ యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి, జనగామలో హైవేపై విషాదం

ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు కేసీఆర్. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అన్న ఆయన…. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొవాలన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.

దిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో మనీ లాండింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ని ఈడీ అధికారులు.. గురువారం రాత్రి అరెస్ట్​ చేశారు. దేశంలో పదవిలో ఉన్న ఒక సీఎం అరెస్ట్​ అవ్వడం ఇదే తొలిసారి! ఇదే కేసులో.. బీఆర్​ఎస్​ నేత కవిత, ఆమ్​ ఆద్మీ నేత- దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్​ సింగ్​లు ఇప్పటికే జైలులో ఉన్నారు. అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​ అయినప్పటికీ.. జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమ్​ ఆద్మీ చెబుతోంది. కానీ.. నైతిక బాధ్యత వహిస్తూ, ఆయన రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్​ చేస్తుంది. వీటన్నింటి మధ్య.. దిల్లీవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలకు ప్రణాళికలు రచిస్తోంది ఆమ్​ ఆద్మీ. ట్రాఫిక్​ జామ్​లతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

Kavitha Arrest in Delhi Liquor Scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేయగా… దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది.

తదుపరి వ్యాసం