Jharkhand: జార్ఖండ్ లో హై డ్రామా; సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ తప్పదా? నెక్ట్స్ సీఎంగా కల్పనా సోరెన్?
Jharkhand politics: జార్ఖండ్ లో ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బుధవారం అరెస్ట్ చేయనుందనే వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో హై డ్రామా నెలకొంది. ఒకవేళ హేమంత్ ను అరెస్ట్ చేస్తే తదుపరి సీఎం ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.
జార్ఖండ్ లో ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం మధ్యాహ్నం నుంచి విచారించనున్నారు. ఆ తరువాత హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, ఒకవేళ హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి.
కల్పనా సోరెన్ ఎవరు?
హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సోమవారం ఈడీ ఆయన ఢిల్లీ ఇంటిపై సోదాలు చేసినప్పుడు హేమంత్ సోరెన్ అదృశ్యంపై సుమారు 40 గంటల పాటు భారీ డ్రామా నడిచింది. తనను అరెస్టు చేస్తే తన భార్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని హేమంత్ సోరెన్ యోచిస్తున్నారని బీజేపీ నేత నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ రోజు హేమంత్ సోరెన్ ఈడీ ముందు హాజరు కానున్నారు. కల్పనను ముఖ్యమంత్రిని చేస్తారనే పుకార్లను హేమంత్ సోరెన్ తోసిపుచ్చారు, కానీ ఇప్పుడు కల్పనను 1996 లో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసినప్పుడు బీహార్ ముఖ్యమంత్రి అయిన రబ్రీదేవితో పోల్చడం ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి.
ఎమ్మెల్యేలతో మంతనాలు
కాగా, హేమంత్ సోరెన్ అరెస్ట్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జేఎంఎం సహా కూటమి ఎమ్మెల్యేలు హేమంత్ ఇంటికి చేరుకుంటున్నారు. తామంతా హేమంత్ కు అండగా నిలుస్తామని చెబుతున్నారు. హేమంత్ సోరెన్ ఎంపిక చేసిన వ్యక్తిని సీఎంగా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక లేఖపై వారంతా సంతకాలు చేసినట్లు సమాచారం. అయితే, కల్పనను సీఎం చేయడానికి హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. కల్పన ఎమ్మెల్యే కాకపోవడంతో పాటు, హేమంత్ పెద్దన్న భార్య సీతా సోరెన్ ఎమ్మేల్యేగా ఉండడం తో సీతా సోరెన్ ను సీఎం చేయాలన్న ప్రతిపాదన కుటుంబ సభ్యుల మధ్య వచ్చినట్లు తెలుస్తోంది.
రాంచీలో భారీ భద్రత
సీఎం హేమంత్ సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసంలోనే ఈడీ అధికారులు బుధవారం ప్రశ్నించనున్నారు. దాంతో, హేమంత్ నివాసం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండాలని ఈడీ ఇప్పటికే నగర పోలీసులను కోరింది. మరోవైపు, హేమంత్ సోరెన్ కు మద్ధతుగా పార్టీ కార్యకర్తలు భారీగా రాంచీకి తరలి వస్తున్నారు. జేఎంఎం, కూటమి ఎమ్మెల్యేలు కూడా రాంచీలోనే ఉన్నారు.
ఎమ్మెల్యేల సమావేశంలో కల్పనా సోరెన్
రాంచీలో మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కల్పనా సోరెన్ పాల్గొన్నారు. ఢిల్లీ నివాసంలో హేమంత్ సోరెన్ ఆచూకీ లభించకపోవడంతో ఆయన పరారయ్యారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో రాంచీ చేరుకున్న హేమంత్ సోరెన్ రెండు సమావేశాలు నిర్వహించారు. హేమంత్ ఈ రోజు ఈడీ వద్ద వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
కల్పనా సోరెన్ వివరాలు.
1. కల్పనా సోరెన్ కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె స్వస్థలం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా.
2. కల్పన 2006 ఫిబ్రవరి 7న హేమంత్ సోరెన్ ను వివాహం చేసుకుంది.
3. కల్పన, హేమంత్ సోరెన్ దంపతులకు నిఖిల్, అన్ష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
4. కల్పన తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. కల్పన వ్యాపార, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
5. కల్పనా సోరెన్ ఓ పాఠశాలను నడుపుతూ సేంద్రియ వ్యవసాయం చేస్తోంది.
6. 1976లో రాంచీలో జన్మించిన కల్పన ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.
7. కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కాదు కాబట్టి, ఆమె సీఎం కావడానికి ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఎవరైనా తన సీటును ఖాళీ చేయాల్సి ఉంటుంది. కల్పన సీఎం కావాలనే ప్రతిపాదనకు హేమంత్ సోదరుడు బసంత్ సోరెన్, అతడి భార్య సీతా సోరెన్ అంగీకరించలేదని బీజేపీ నేత నిషికాంత్ దూబే తెలిపారు.
8. హేమంత్ సోదరుడు మాత్రం జార్ఖండ్ ముక్తి మోర్చా కుటుంబం ఐక్యంగా ఉందని, నిషికాంత్ దూబే కుటుంబంలోనే విభేదాలు వచ్చాయని చెప్పారు.
9. కల్పనా సోరెన్ ను తదుపరి ముఖ్యమంత్రిని చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన జేఎంఎం సమావేశంలో కనీసం 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నిషికాంత్ దూబే చెప్పారు.
10. ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తే ఆయన సతీమణి కల్పనా సోరెన్ కు పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు పేరు లేకుండా మద్దతు లేఖపై సంతకాలు చేసినట్లు పిటిఐ తెలిపింది.
10. రాంచీలో మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో కల్పనా సోరెన్ పాల్గొన్నారు. ఢిల్లీ నివాసంలో హేమంత్ సోరెన్ ఆచూకీ లభించకపోవడంతో ఆయన పరారయ్యారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరిగాయి. ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో రాంచీ చేరుకున్న హేమంత్ సోరెన్ రెండు సమావేశాలు నిర్వహించారు. హేమంత్ ఈ రోజు ఈడీ వద్ద వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
---
Legislators of the ruling JMM-led coalition assembled at Jharkhand Chief Minister Hemant Soren’s residence here, ahead of his questioning by the Enforcement Directorate on Wednesday.
ED officers are scheduled to visit the CM's residence this afternoon to record Soren's statement in a money laundering case linked to an alleged land scam.
State Agriculture Minister Badal Patralekh told PTI that all legislators stand solidly behind the chief minister.
Soren, 48, also the executive president of the Jharkhand Mukti Morcha, ended the suspense over his whereabouts on Tuesday, as he reached his official residence in Ranchi and chaired a meeting of his alliance MLAs.
The CM’s wife Kalpana Soren, who is not a legislator, was also present at the meeting.
The lawmakers expressed solidarity with the Hemant Soren government at the meeting, and also signed a letter of support without any name, as speculations are rife that the chief minister's wife will be handed over the reins in the event of his arrest.
However, one JMM MLA who was conspicuous by her absence at the meeting was Sita Soren, widow of Durga Soren, the elder brother of the CM.
Sita Soren represents the Jama constituency in the assembly.
"A power tussle is evident within the family, but on the issue of any threat to the government, they are all united. The CM's brother Basan Soren, also a legislator, has spoken in his favour, too," an MLA, who requested anonymity, said.
In an email to the ED on Sunday, Soren had alleged that its actions were "motivated by political agenda" to disrupt the state government's functioning, and claimed that the insistence to record his statement again on or before January 31 "reeked of malice".
The probe agency has seized ₹36 lakh, an SUV and some "incriminating" documents during search operations at his house in Delhi on Monday.
Soren is being questioned as part of a probe into a "huge racket of illegal change of ownership of land by the mafia" in Jharkhand, ED officials have said.
Meanwhile, prohibitory orders were clamped in key areas of Ranchi, and a three-member team has been formed to oversee the law and order situation in the Jharkhand capital.
According to an official release, the prohibitory orders under Section 144 of the CrPC are effective from 9 am to 10 pm within a radius of 100 metres at key locations, including the CM House, Raj Bhavan and the ED office at Doranda.
As part of the restrictions, demonstrations, rallies or meetings cannot be held in and around these areas.