Liquor case explained : హై- ప్రొఫైల్​ నేతలపై పిడుగు- 'లిక్కర్​' కేసుతో ఉక్కిరిబిక్కిరి!-delhi cm kejriwal arrested what is delhi liquor case in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Liquor Case Explained : హై- ప్రొఫైల్​ నేతలపై పిడుగు- 'లిక్కర్​' కేసుతో ఉక్కిరిబిక్కిరి!

Liquor case explained : హై- ప్రొఫైల్​ నేతలపై పిడుగు- 'లిక్కర్​' కేసుతో ఉక్కిరిబిక్కిరి!

Sharath Chitturi HT Telugu

Liquor case explained in Telugu : అసలేంటి ఈ దిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసు? ఇప్పటివరకు ఎంత మంది అరెస్ట్​ అయ్యారు? ఈడీ ఏం చెబుతోంది? ఇక్కడ తెలుసుకోండి..

దిల్లీ లిక్కర్​ కేసులో కొనసాగుతున్న బడా నేతల అరెస్ట్​లు..

Arvind Kejriwal arrested : 'లిక్కర్​ కేస్​.. లిక్కర్​ కేస్​.. లిక్కర్​ కేస్​..' దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​తో.. దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అంతేకాదు.. వారం రోజుల వ్యవధిలో బీఆర్​ఎస్​ నేత కవిత- కేజ్రీవాల్​ని ఈడీ అరెస్ట్​ చేయడం.. ఈ కేసు తీవ్రతకు అద్దపడుతోంది. ఈ పరిణామాలు.. సరిగ్గా 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు జరుగుతుండటం.. సర్వత్రా చర్చలకు దారితీసింది. ఫలితంగా.. దిల్లీ లిక్కర్​ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్​ పడింది. అసలేంటి ఈ లిక్కర్​ కేసు? బడా నేతలపై ఈడీ మోపిన ఆరోపణలేంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

దిల్లీ లిక్కర్​ కేసు వివరాలు..

2021-22 ఏడాదిలో.. దిల్లీ ఎక్సైజ్​ లిక్కర్​ పాలసీని ప్రవేశపెట్టింది అరవింద్​ కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం. దక్షిణ భారతానికి చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో ఆమ్​ ఆద్మీ కుమ్మక్కైందని, రూ. 100 కోట్ల లంచం తీసుకుని, వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా పాలసీని రూపొందించిందన్నది ప్రధాన ఆరోపణ. కాగా.. కొంతకాలం తర్వాత.. ఈ దిల్లీ లిక్కర్​ పాలసీని ప్రభుత్వం కొట్టివేసింది. కానీ ఈడీ మాత్రం.. లిక్కర్​ పాలసీలో స్కామ్​ జరిగిందని చెబుతూ వస్తోంది.

ఈడీ ప్రకారం.. అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, బీఆర్​ఎస్​ నేత కే. కవితలు.. శరత్​ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిసి కుట్ర చేశారు. 2021-22 లిక్కర్​ పాలసీ 'డీల్​'లో భాగంగా.. శరత్​, మాగుంట, కవితలకు.. దిల్లీలోని 32 జోన్లలో 9 జోన్లు దక్కాయి. పాలసీలో హోల్​సేలర్స్​కి 12శాతం, రీటైర్లకు 185శాతం ప్రాఫిట్​ మార్జిన్​ వస్తుంది. ఇది సాధారణం కన్నా చాలా చాలా ఎక్కువ!

What is Delhi liquor scam : ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్​ అయ్యారు. వారు.. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, బీఆర్​ఎస్​ నేత కవిత, ఆమ్​ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్​.

ఈ 12శాతం ప్రాఫిట్​లో 6శాతం ప్రాఫిట్స్​ని హోల్​సేలర్స్​ నుంచి ఆమ్​ ఆద్మీ పార్టీ వసూలు చేయాలని డీల్​ కుదిరిందని ఈడీ ఆరోపిస్తోంది.

"దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో కలిసి కవిత.. లిక్కర్​ స్కామ్​కు పాల్పడ్డారు. నాటి దిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్​శాఖ మంత్రి సిసోడియా హస్తం కూడా ఉంది. మధ్యవర్తుల ద్వారా.. కవిత, సౌత్​ గ్రూప్​ కలిసి.. ఆమ్​ ఆద్మీకి ముడుపులు చెల్లించింది. ఫలితంగా.. కవితకు పాలసీ ఫార్ములేషన్​పై పట్టు దక్కింది. కవిత కోరుకున్నట్టుగా ఆమెకు ఈ పాలసీలో ప్రయోజనం చేకూరింది," అని.. గత వారం బీఆర్​ఎస్​ నేతను అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించిన అనంతరం ఓ ప్రకటనలో పేర్కొంది ఈడీ.

వీళ్లే కుట్ర చేశారు..?

Delhi liquor case explained in Telugu : ఈడీ ప్రకారం.. ఆమ్​ ఆద్మీ నేతల తరఫున ఈ లిక్కర్​ పాలసీ 'వ్యవహారాలను' ఆ పార్టీకి చెందిన మాజీ కమ్యూనికేషన్స్​ ఇన్​ఛార్జ్​ విజయ్​ నాయర్​ చూసుకున్నారు. రూ. 100 కోట్ల ముడుపులు.. ఆయన ద్వారనే చేతులు మారాయి!

"విజయ్​ నాయర్​.. ఓ సాధారణ ఆమ్​ ఆద్మీ పార్టీ కార్యకర్త కాదు. దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి అత్యంత సన్నిహితుడు," అని గతేడాది ఈడీ విడుదల చేసిన డాక్యుమెంట్​లో ఉంది.

అయితే.. కుట్రకు పాల్పడింది కవితే అయినా.. ఈ లిక్కర్​ పాలసీ అనేది కేజ్రీవాల్​ సృష్టి అని ఈడీ చెబుతోంది. ఈ విషయాన్ని, ఇదే కేసులో కీలక నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త సమీర్​ మహేంద్రు చెప్పినట్టు ఈడీ పేర్కొంది.

"కేజ్రీవాల్​, మహేంద్రుల మధ్య ఫేస్​టైమ్ కాల్​​ నిర్వహించాడు నాయర్​. విజయ్​ తన మనిషి అని, అతడిపై నమ్మకం ఉంచాలని కేజ్రీవాల్​.. మహేంద్రుకు చెప్పారు," అని ఈడీ ఆరోపిస్తోంది.

లిక్కర్​ స్కామ్​ కేసు విచారణలో భాగంగా.. మనీశ్​ సిసోడియా మాజీ సెక్రటరీ సీ అరవింద్​.. పలు కీలక విషయాలను వెల్లడించారు.

Kejriwal arrested : "2021 మార్చ్​లో నేను కేజ్రీవాల్​ ఇంటికి వెళ్లాను. ప్రైవేట్​ సంస్థలకు 12శాతం మార్జిన్​ ఇవ్వాలని అప్పుడే నిర్ణయంచారు. దానికన్నా ముందు జరిగిన జీఓఎం (గ్రూప్​ ఆఫ్​ మినిస్టర్స్​) సమావేశంలో.. 12శాతం ప్రాఫిట్​ వ్యవహారం చర్చకు రాలేదు. కానీ 2021 మార్చ్​లో.. కేజ్రీవాల్​ నివాసంలో కీలక నేతలు కలిశారు. జీఓఎం రిపోర్ట్​ డ్రాఫ్ట్​ని నా చేతుల్లో పెట్టారు. హోల్​సేల్​ బిజినెస్​.. ప్రైవేట్​ సంస్థలకు వెళ్లాలని, అందకు తగ్గట్టుగా డాక్యుమెంట్స్​ని తయారు చేయాలని చెప్పారు. అప్పటివరకు చర్చే జరగని ప్రతిపాదనను తొలిసారిగా అప్పుడే చూశాను," అని సీ అరవింద్​.. ఈడీ విచారణలో చెప్పారు.

అయితే.. 2023 డిసెంబర్​లో ఈడీ వేసిన 6వ ఛార్జ్​ షీట్​ ప్రకారం.. లిక్కర్​ పాలసీ కింద వచ్చిన రూ. 45 కోట్ల ముడుపులను ఆమ్​ ఆద్మీ పార్టీ.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఉపయోగించింది. ఇది నేరపూరితమైన చర్య. అంతేకాకుండా.. ఇలా వచ్చిన డబ్బులతో.. పలువురు ఆమ్​ ఆద్మీ నేతలు కూడా లబ్ధిపొందరు. సిసోడియాకు రూ. 2.2 కోట్ల లంచం దక్కింది. సంజయ్​ సింగ్​, నాయర్​లకు ఆ ఫిగర్​ రూ. 2 కోట్లు, రూ. 1.5కోట్లుగా ఉంది.

అయితే.. ఈ నేరపూరిత చర్యలకు సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి ఇంకా ఈడీ ఎలాంటి లింక్​ని పెట్టలేదు.

Kejriwal news today ED : మరి ఈ దిల్లీ లిక్కర్​ కేసు ఇంకెన్ని మలుపులు తిరిగుతుందో! ఇంకెంతమంది పేర్లు బయటకి వస్తాయో! జైలుకు వెళ్లిన వారు ఎప్పుడు బయటకి వస్తారో! వంటి విషయాలకు కాలమే సమాధానం చెబుతుంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.