Delhi CM Kejriwal Arrest : లిక్కర్ కేసులో ఈడీ దూకుడు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!-ed arrests delhi chief minister arvind kejriwal in the alleged liquor policy scam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Cm Kejriwal Arrest : లిక్కర్ కేసులో ఈడీ దూకుడు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!

Delhi CM Kejriwal Arrest : లిక్కర్ కేసులో ఈడీ దూకుడు - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్!

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 21, 2024 09:53 PM IST

Delhi Excise Policy Case Updates: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ. దాదాపు 2 గంటలపాటు కేజ్రీవాల్ నివాసంలో ఈడీ బృందం సోదాలు చేపట్టింది.

కేజ్రీవాల్ అరెస్ట్
కేజ్రీవాల్ అరెస్ట్

ED Arrests Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇవాళ సాయంత్రం తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు చేపట్టింది. దాదాపు రెండు గంటలపాటు సోదాలు చేపట్టిన ఈడీ అధికారుల బృందం…. కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ను అరెస్ట్ చేసింది. కాసేపట్లో ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించనుంది. మరోవైపు కేజ్రీవాల్ నివాసంతో పాటు ఢిల్లీలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో… ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

yearly horoscope entry point

కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండిస్తూ ఆప్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు… పలువురు ఆప్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆప్ కార్యకర్తలు భారీగా రోడ్లపైకి వచ్చారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఫలితంగా రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

హైకోర్టులో దక్కని ఊరట - రంగంలోకి ఈడీ

ఈ కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే 9 సార్లు సమన్లు జారీ అయ్యాయి. కానీ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఈ కేసులో ఊరట దక్కలేదు. అరెస్ట్ నుంచి మినహాయించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని... అరెస్ట్ మినహాయింపు ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. కోర్టు ఆదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. ఇవాళ సాయంత్రం తర్వాత... కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంది. 8 మంది అధికారులతో కూడిన బృందం... కేజ్రవాల్ నివాసంలో సోదాలు చేపట్టింది. కేసుకు సంబంధించి పలు అంశాలపై విచారణ జరిపింది. దాదాపు రెండు గంటలకుపైగా కేజ్రీవాల్ విచారణ కొనసాగింది. ఆ తర్వాత…. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ. ఈ మేరకు కేజ్రీవాల్ భార్యకు కూడా సమాచారం కూడా అందించింది.

రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ

కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ… ఢిల్లీలోని కార్యాలయానికి తరలిస్తోంది. రేపు(శుక్రవారం) కోర్టులో హాజరుపర్చనుంది. ఈ మేరకు ఈడీ అధికారుల బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఇదే తరహాలో అరెస్ట్ చేసింది ఈడీ. హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ అధికారుల బృందం….. విచారణ అనంతరం కవితను అదుపులోకి తీసుకుంది. రాత్రి సమయానికి ఢిల్లీకి తరలించింది. మరునాడు కోర్టులో హాజురపర్చగా… కోర్టు కూడా రిమాండ్ విధించింది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలోనే ఉన్నారు. 

ఇక కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు… ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని చెప్పటంతో… ఆయన ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ జరగవచ్చని తెలుస్తోంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.