BRS BSP Alliance: రెండు స్థానాల్లో బిఎస్పీ.. పొత్తులపై కొలిక్కి వచ్చిన కేసీఆర్ లెక్కలు..-kcrs calculations on bsp alliances with two seats share ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Bsp Alliance: రెండు స్థానాల్లో బిఎస్పీ.. పొత్తులపై కొలిక్కి వచ్చిన కేసీఆర్ లెక్కలు..

BRS BSP Alliance: రెండు స్థానాల్లో బిఎస్పీ.. పొత్తులపై కొలిక్కి వచ్చిన కేసీఆర్ లెక్కలు..

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:29 AM IST

BRS BSP Alliance: లోక్‌సభ ఎన్నికల్లో బిఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన కేసీఆర్‌, రెండు సీట్లను ఆ పార్టీకి కేటాయించాలని నిర్ణయించారు.

రెండు స్థానాల్లో బిఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయనున్న బిఎస్పీ
రెండు స్థానాల్లో బిఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయనున్న బిఎస్పీ

BRS BSP Alliance: లోక్‌సభ  Loksabhaఎన్నికల్లో తెలంగాణలో బిఎస్పీతో ఎన్నికల పొత్తు ఖరారైంది. ఇప్పటికే నాగర్ కర్నూలు స్థానాన్ని బిఎస్పీకి కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్‌ అధినేత తాజాగా హైదరాబాద్ స్థానాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ - బిఎస్పీ BSP పొత్తులపై Alliance ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం నాగర్‌ కర్నూలు, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను బిఎస్పీకి కేటాయించేందుకు KCR సుముఖత వ్యక్తం చేశారు.

నాగర్‌ కర్నూలులో బిఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ RS Praveen kumar స్వయంగా పోటీ చేయనున్నారు. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా ఎంఐఎం పార్టీ దక్కించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ ‌లో బీజేపీ అభ్యర్ధిగా మాధవిని ప్రకటించారు. తాజాగా బిఆర్‌ఎస్‌ మద్దతుతో బిఎస్పీ అభ్యర్థి కూడా Hyderabad  లొ పోటీ చేయనున్నారు.

నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. రెండు స్థానాల్లో అభ్యర్థులను బీఎస్పీ ఖరారు చేసుకోనున్నది.

ఇప్పటికే ఖరారైన పొత్తు…

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్‌ఎస్‌ రెండు సీట్లు కేటాయించింది.

పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో పాటు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బీఎస్పీ పోటీ చేయనుంది. నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి స్వయంగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎన్నికలో బరిలో దిగనున్నారు. హైదరాబాద్‌ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నదానిపై బీఎస్పీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బిఆర్‌ఎస్‌లో మరో రెండు పేర్లు ఖరారు…

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు.

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు పోటీ చేసే అవకాశం లభించింది.

తాజా ప్రకటనతో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను 11 సీట్లకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ఖరారు చేసింది. రెండు స్థానాల్లో బిఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

దీంతో బిఆర్‌ఎస్‌ మరో నాలుగు స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అభ్యర్థు లను ప్రకటించాల్సిన నియోజకవర్గాల జాబితాలో సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరి, మెదక్‌ ఉన్నాయి. నల్గొండ, భువనగిరిలో బిఆర్‌ఎస్‌ తరపున పోటీకి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కాంగ్రెస్‌ జాబితా వెలువడిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తుండటంతో ఎన్నికల ప్రచార సభలపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో మార్చి 23న బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన చోట బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకోవాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశించారు.

 

Whats_app_banner