తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు

HT Telugu Desk HT Telugu

30 November 2022, 21:55 IST

    • Kavitha Name In Delhi Liquor Scam : దిల్లీ మద్యం కుంభకోణం కేసు సంచలనం సృష్టిస్తోంది. అయితే దిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)
ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో) (twitter)

ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పేరు ఉంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు(Amith Arora Remand Report)లో కవిత పేరు పేర్కొంది ఈడీ. మంగళవారం రాత్రి అమిత్ అరోరాను అరెస్టు చేసింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అరోరా ధృవీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది ఈడీ. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహుతుడు అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పిచింది. ఇందులోనే కవిత పేరు కూడా ప్రస్తావించింది. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. వైసీపీ ఎంపీ(YSRCP MP) మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని తెలిపింది. ఇందు కోసం.. ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది.

ఈ లిక్కర్ కుంభకోణంలో.. అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ నుంచి వినిపిస్తున్న సమచారం. గురుగావ్ కు చెందిన అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్టుగా సమాచారం. దినేష్ అరోరా(Dinesh Arora) అప్రూవర్‌గా మారగా... అమిత్ అరోరా ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. అమిత్ అరోరా 9వ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికి ఈ కేసులో ఈడీ ఆరుగురిని అరెస్టు చేసింది.

ఇప్పుడు సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. అరబిందో శరత్ రెడ్డి(Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అరబిందో డైరక్టర్ శరత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో కవితకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

మెుదటి నుంచి కవితపై బీజేపీ నేతలు(BJP Leaders) దిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విమర్శలు చేస్తున్నారు. తనపై ఆరోపణల చేయడంపై కవిత మండిపడ్డారు. ఆధారాలు లేకుండా.. ఆరోపిస్తున్నారని కోర్టుకు వెళ్లారు. తనపై విమర్శలు చేయకుండా.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు విమర్శలు తగ్గించారు.