తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Rajasthan Tour From Hyderabad City

IRCTC Rajasthan Tour: తక్కువ ధరలో రాజస్థాన్ ట్రిప్.. ఈ IRCTC ఫ్లైట్ ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu

08 January 2023, 13:28 IST

    • IRCTC Rajasthan Tour From Hyderabad: రాజస్థాన్ టూర్ ప్లాన్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ - రాజస్థాన్ టూర్
హైదరాబాద్ - రాజస్థాన్ టూర్ (twitter)

హైదరాబాద్ - రాజస్థాన్ టూర్

IRCTC Tourism Rajasthan Tour:IRCTC Rajasthan Tour Package 2022 : రాజస్థాన్‌లోని పర్యాటక ప్రాంతాలు చూడాలని అనుకునేవారికి శుభవార్త. IRCTC ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీ అందిస్తోంది. "Golden Sands of Rajasthan" పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఫ్లైట్‌లో పర్యాటకుల్ని రాజస్థాన్ తీసుకెళ్తుంది. జైసల్మేర్, జోద్ పూర్, మౌంట్ అబు, ఉదయ్ పూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 11వ తేదీన అందుబాటులో ఉంటుంది. షెడ్యూల్ వివరాలు చూస్తే.....

Day 1: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం బయల్దేరుతారు. ఉదయపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత... హోటల్ లోకి చెకిన్ అవుతారు. లంచ్ సాహేలి కీ బరి, ఫతే సాగర్ లేక్ సందర్శిస్తారు. రాత్రి ఉదయ్ పూర్ లోనే బస చేస్తారు.

Day 2 : బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మౌంట్ అబు(MOUNT ABU)కు వెళ్తారు. తర్వాత దిల్వారా జైన ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నక్కీ లేక్ కు వెళ్తారు. రాత్రి మౌంట్ అబులోనే బస చేస్తారు.

Day 3: అల్పహారం తర్వాత జైసల్మీర్(JAISALMER)కు వెళ్తారు. బర్మర్ లో లంచ్ ఉంటుంది. తిరిగి జైసల్మేర్‌ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day 4: బ్రేక్ ఫాస్ట్ తర్వాత... జైసల్మేర్ ఫోర్టు(JAISALMER Fort)కు చేరుకుంటారు. మధ్యాహ్నం డిసెర్ట్ క్యాంప్ కు వెళ్తారు. అక్కడ క్యామెల్ సఫారీ ఉంటుంది. జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. రాత్రి జైసల్మేర్ డిసెర్ట్ క్యాంప్ లోనే బస చేస్తారు.

Day 5: బ్రేక్ ఫాస్ట్ తర్వాత... హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడ్నుంచి జోద్ పూర్(JODHPUR)కు వెళ్తారు. అనంతరం ఉమేద్ భవన్ ప్యాలెస్ ను సందర్శిస్తారు. రాత్రి జోద్ పూర్ లోనే బస చేస్తారు.

Day 6: బ్రేక్ ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. తర్వాత మెరంఘర్ పోర్టును వెళ్తారు. మధ్యాహ్నం జోద్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుతారు. అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ల రేట్లు...

GOLDEN SANDS OF RAJASTHAN Tour Cost : కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 41,850 ధర ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 32,750 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.31,700 గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.279ద0గా టికెట్ ధర నిర్ణయించారు. ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

హైదరాబాద్ - రాజస్ఠాన్ టూర్ టికెట్ల రేట్లు

NOTE:

లింక్ పై క్లిక్ చేసి టూర్ ప్యాకేజీని బుక్ చేయటంతో పాటు మిగతా వివరాలను తెలుసుకోవచ్చు.