తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Munnar Tour Package From Hyderabad City

IRCTC Hyd Munnar Tour: మున్నార్ చుట్టేస్తారా... మీ కోసమే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ

23 September 2022, 14:44 IST

    • hyderabad Munnar tour package: హైదరాబాద్ నుంచి మున్నార్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్ మున్నార్ టూర్,
హైదరాబాద్ మున్నార్ టూర్, (/www.irctctourism.com)

హైదరాబాద్ మున్నార్ టూర్,

irctc tourism announced munnatr tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కేరళలోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Padmasri Awardee Mogulaiah: దినసరి కూలీగా పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగలయ్య, గౌరవ వేతనం ఆగడంతో కష్టాలు

3 may 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Karimnagar landgrabbers: కరీంనగర్‌ భూకబ్జాదారులపై ఉక్కుపాదం, పోలీసు కస్టడీకి 9మంది నిందితులు

hyderabad kerala hills tour: ఈ నెల అక్టోబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day 02 Wednesday: మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.

Day 03 Thursday: ఉదయమే ఎర్నాకులం నేషనల్ పార్క్ కు వెళ్తారు. తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం, ఎకో పాయింట్ కు వెళ్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే బస చేస్తారు.

Day 04 Friday: హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

Day 05 Saturday: హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు(Train No. 17229, Sabari Express ) జర్నీ స్టార్ అవుతుంది.

Day 06 Sunday: మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే.....

hyd munnar tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 29,830 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17,240 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.14,300గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి.

<p>ధరల వివరాలు</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు