IRCTC Tirupati Ooty Tour: తిరుపతి టు ఊటీ.. టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism announced ooty tour package from tirupati city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Irctc Tourism Announced Ooty Tour Package From Tirupati City

IRCTC Tirupati Ooty Tour: తిరుపతి టు ఊటీ.. టూర్ ప్యాకేజీ వివరాలివే

Mahendra Maheshwaram HT Telugu
Sep 11, 2022 11:40 AM IST

tirupati ooty tour package: తిరుపతి నుంచి ఊటీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

తిరుపతి ఊటీ టూర్,
తిరుపతి ఊటీ టూర్, (www.irctctourism.com)

irctc tourism announced tirupati ooty package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా తిరుపతి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX TIRUPATI ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి.

tirupati ooty tour: ఈ నెల సెప్టెంబర్ 20వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day 01 Tuesday: తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 11.50 గంటలకు ట్రైన్ బయల్దేరుతుంది. రాత్రి అంత జర్నీ ఉంటుంది.

Day 02 Wednesday: ఉదయం 08.2 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఊటీకి వెళ్తారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత... మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఊటీ లేక్ చూస్తారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day 03 Thursday: బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట, టీ మ్యూజియం, పైకార ఫాల్స్ కు వెళ్తారు. రాత్రి కూడా ఊటీలోనే బస చేస్తారు.

Day 04 Friday: బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి చేరుకుంటారు. రాత్రి ఊటీలోనే ఉంటారు.

Day 05 Saturday: హోటల్ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 04.35 నిమిషాలకు రైలు ప్రయాణం మొదలవుతుంది.

Day 06 Sunday: రాత్రి 12.5 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే.....

tirupati ooty tour cost: సింగిల్ షేరింగ్ కు రూ. 25,420 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 13,780 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.10,870గా ఉంది. 3 టైర్ ఏసీ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point