SCR Special Trains: తిరుపతి, జైపూర్ కు స్పెషల్ ట్రైన్స్.. వెళ్లే రూట్స్ ఇవే-south central railway announced special trains between tirupati nanded ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Scr Special Trains: తిరుపతి, జైపూర్ కు స్పెషల్ ట్రైన్స్.. వెళ్లే రూట్స్ ఇవే

SCR Special Trains: తిరుపతి, జైపూర్ కు స్పెషల్ ట్రైన్స్.. వెళ్లే రూట్స్ ఇవే

Mahendra Maheshwaram HT Telugu
Sep 09, 2022 08:18 PM IST

Special Trains From Andhrapradesh: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి, నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.

జైపూర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
జైపూర్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి, నాందేడ్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

H.S Nanded - Tirupati Special Trains: నాందేడ్ నుంచి తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు సెప్టెంబర్ 10వ తేదీన నాందేడ్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 గంటలకు తిరుపతికి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 1వ తేదీన 09.10 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 5.20 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్ పుర్ణ, పర్బాణీ, గంగాఖేర్, పర్లివైజ్ నాథ్, లాటర్ రోడ్, ఉద్గిరి, బల్కి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూరు, సెరం, చిత్తపూర్, సూలేహల్లీ, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయంరోడ్డు, ఆదోని, గుంతకల్లు, గూటి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ మరియ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఈ రైళ్లు రద్దు….

south central railway cancelled many trains: ప్రయాణికులకు కీలక అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా మార్గాల్లో పనులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రేపల్లె, తెనాలి, గూడూరు, మధిర నగరాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.

విజయవాడ – గూడూరు (07500) రైలు, గూడూరు – విజయవాడ (07458), సికింద్రాబాద్ – మధిర (17202), మధిర – సికింద్రాబాద్ 17201 రైళ్లను 11, 12 తేదీల్లో రద్దు చేశారు.

కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం మధ్య నడిచే 17267 రైలు, విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ మధ్య రాకపోకలు సాగించే 17268, కాకినాడ పోర్ట్ – విజయవాడ, విజయవాడ – కాకినాడ పోర్ట్ 17257 రైలు కూడా 10, 11 తేదీల్లో రద్దైంది. విజయవాడ – గుంటూరు రైలు, గుంటూరు – రేపల్లె 07786 రైలు, రేపల్లె – తెనాలి 07873, తెనాలి – గుంటూరు 07282, గుంటూరు – విజయవాడ 07864, విజయవాడ – గుంటూరు 07464, గుంటూరు – విజయవాడ 07465 రైళ్లు కూడా 10, 11 తేదీల్లో రద్దయ్యాయి.

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ - మదరి మధ్య నడిచే 17202, మధిర - సికింద్రాబాద్ (17201) మధ్య నడిచే రైళ్లను 11, 12వ తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు వీటిని గమనించి రాకపోకలను కొనసాగించాలని కోరారు.

విశాఖపట్నం - మహబూబ్ నగర్ మధ్య నడిచే రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్నవరం రైల్వే స్టేషన్ ను కూడా రైలు ఆగే జాబితాలో చేర్చారు. ప్రయాణికులు అన్నవరంలో కూడా ఎక్కవచ్చిని పేర్కొంది. ఈ మేరకు వివరాలను ప్రకటచించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం