తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Announced Divine Karnataka Tour From Hyderabad Here's Full Details

IRCTC Karnataka Tour : మంగళూరు చూడాలని ఉందా? ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదే

Anand Sai HT Telugu

13 November 2022, 22:46 IST

    • Karnataka Tour Package Details : హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
మంగళూరు
మంగళూరు

మంగళూరు

చలికాలంలో ఎక్కడికైనా టూర్ వెళ్లాలా? మీ కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. డివైన్ కర్ణాటక పేరుతో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. రైలులో తీసుకెళ్తుంది. 5 రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. కర్నాటకలోనూ పలు ప్రాంతాలను చూపిస్తారు. మంగళూరు, ఉడుపి, ధర్మస్థల, శృంగేరిలాంటి ప్రాంతాలను చూపిస్తారు. DIVINE KARNATAKA పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

నవంబర్ 22వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. మెుదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 06.06 నిమిషాలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి బయల్దేరుతారు. St Mary's Island ను చుస్తారు. మల్పి బీచ్ అనంతరం రాత్రికి ఉడిపిలోనే బస చేస్తారు. మూడో రోజు శ్రీకృష్ణ ఆలయం చూపిస్తారు. ఆ తర్వాత ఉడిపి నుంచి బయల్దేరి శృంగేరికి చేరుకుంటారు. శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ్నుంచి మంగళూరుకు ప్రయాణం మొదలవుతుంది. హోటల్ కి చెకిన్ అయిన తరువాత... రాత్రి మంగళూరులోనే బస చేస్తారు. ఇక్కడ పలు ప్రాంతాలు చూస్తారు.

నాలుగో రోజుధర్మస్థలికి వెళ్తారు. మంజునాథ టెంపుల్ ను సందర్శిస్తారు. అనంతరం కుక్కే సుబ్రమణ్య టెంపుల్ ఆలయం దర్శిస్తారు. ఆ తర్వాత మంగళూరు హోటల్ వచ్చి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు హోటల్ నుంచి చెకౌట్ చేస్తారు. పిలికుల, మంగల దేవి టెంపుల్ లాంటి పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఆ తర్వాత రాత్రికి మంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఆరో రోజు కాచిగూడకు రాత్రి 11.40కి చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధరలివే..

Hyderabad To Karnataka Tour Package : సింగిల్ షేరింగ్ కు రూ. 32,890 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,690 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.16,210గా ఉంది. కంఫర్ట్ క్లాస్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.