తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Traffic Alerts : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ .... ప్రత్యామ్నయ మార్గాలివే..

HYD Traffic Alerts : హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ .... ప్రత్యామ్నయ మార్గాలివే..

HT Telugu Desk HT Telugu

29 December 2022, 11:17 IST

    • HYD Traffic Alerts రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ బొల్లారం షేక్‌పేట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు ప్రకటించారకు. ప్రయాణికులు ట్రాఫిక్ సూచనల్ని పరిగణలోకి తీసుకుని ప్రయాణించాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

HYD Traffic Alerts హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు కానున్నాయి. రాష్ట్రపతి బసచేసిన బొల్లారంతో పాటు పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా నియంత్రిస్తారని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రాఫిక్ నిబంధనలు అమలు కానున్నాయి. బొల్లారం నుంచి షేక్‌పేట వరకు వాహనాల రాకపోకల్లో తీవ్ర రద్దీ ఏర్పడుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

లోతుకుంట, తిరుమలగిరి, కార్ఖానా, టివోలి, ప్లాజా జంక్షన్, పిఎన్‌టి ఫ్లైఓవర్‌, హెచ్‌పిఎస్‌ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ ల్యాండ్ జంక్షన్‌, మోనసప్ప జంక్షన్‌, ఎన్‌ఎఫ్‌సిఎల్‌ జంక్షన్‌, ఎస్‌ఎన్‌టి జంక్షన్‌, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, జూబ్లీహిల్స్‌ రోడ్ నెం.45 జంక్షన్‌, బివిబి జంక్షన్‌, ఫిల్మ్ నగర్‌, రేతిబౌలి జంక్షన్‌, షేక్‌పేట్ ఫ్లైఓవర్‌, షేక్‌పేట్ నాలా, టూంబ్స్‌, గచ్చిబౌలి వైపు ట్రాఫిక్‌ మెల్లగా సాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.

లోతుకుంట నుంచి గచ్చిబౌలి వరకు మధ్యలో ఉన్న కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ప్రయాణికులు అయా కూడళ్ల మీదుగా వెళ్లొద్దని సూచిస్తున్నారు. ప్రత్యామ్నయ మార్గంగా షామీర్‌ పేట్‌ నుంచి మేడ్చల్‌ ఔటర్ రింగ్‌ రోడ్డు ఉపయోగించాలని సూచిస్తున్నారు. కొంపల్లి-సుచిత్ర-బోయినపల్లి-తాడ్‌బండ్‌- లీరాయల్ ప్యాలెస్‌-సీటీఓ మీదుగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

టాపిక్