తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad News : హైదరాబాద్ లో ఉగ్రమూకల కదలికలు, ఏటీఎస్ ఆపరేషన్ లో 16 మంది అరెస్ట్

Hyderabad News : హైదరాబాద్ లో ఉగ్రమూకల కదలికలు, ఏటీఎస్ ఆపరేషన్ లో 16 మంది అరెస్ట్

09 May 2023, 13:52 IST

    • Hyderabad News : హైదరాబాద్ లో రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు పట్టుబడ్డారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆపరేషన్ లో 16 మందిని అరెస్టు చేశారు. వీరంతా ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితులపై ఆయా సంస్థల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లో ఉగ్రమూకలు అరెస్ట్
హైదరాబాద్ లో ఉగ్రమూకలు అరెస్ట్ (HT Print )

హైదరాబాద్ లో ఉగ్రమూకలు అరెస్ట్

Hyderabad News : హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో 16 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 11 మంది భోపాల్ కు చెందిన వారు కాగా, హైదరాబాద్ కు చెందిన 5గురు ఉన్నారని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వెల్లడించింది. అరెస్టైన వారి నుంచి ఇస్లామిక్ జిహాదీ బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కత్తులు ఏటీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. వారిపై దాడులు నిర్వరించి 16 మందిని అరెస్ట్ చేసి భోపాల్ తీసుకెళ్లారు మధ్యప్రదేశ్ పోలీసులు. ఒక కేసులో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి నిఘా భోపాల్ పోలీసులు.. రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

18 నెలలుగా కార్యకలాపాలు

ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టిన కేంద్ర వర్గాలు స్థానిక పోలీసుల సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా నిఘా సంస్థలు గుర్తించాయి. నిందితులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అరెస్టు చేసిన వారితో సంబంధాలు కలిగి ఉన్న వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరంతా ఉగ్రవాద సంస్థల వ్యవహారాలకు ఆకర్షితులై ఆయా సంస్థల్లో చేరాలనే ఉద్దేశంతో గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమనిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌ నుంచి కొంత మంది సిరియా వెళ్లి ఐసిస్‌లో చేరే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. కొంత మందిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఎన్ఐఏ వంటి నిఘా సంస్థలు పట్టుకున్నాయి.

సోషల్ మీడియా వేదికగా

అరెస్టైన్ నిందితుల నుంచి ఎలక్ట్రానిక్ డివైన్స్, డ్రాగర్స్, మొబైల్స్, ఇస్లామిక్ జీహాది సాహిత్యం, కత్తులను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు వీరంతా ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ సానుభూతిపరులతో వీరంతా టచ్ లో ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే భోపాల్, హైదరాబాద్ లో మకాం వేసినట్లు నిఘా సంస్థలు పసిగట్టాయి. ఈ విషయంపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

గత ఏడాది ఐసిస్ సానుభూతిపరుడు అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీలో గత ఏడాది ఐసిస్ అనుభూతిపరుడు అరెస్టై్య్యాడు. ఐసిస్ తీవ్రవాదంపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు గత ఏడాది ఏప్రిల్ లో అరెస్ట్ చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా హైదరాబాద్ నుంచి వెళ్లి యుద్ధం చేయాలని సులేమాన్ అనేవ్యక్తి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అతడి ఐపీ అడ్రస్ అడ్రస్ లొకేట్ చేసి మీర్ చౌక్ పోలీసుస్టేషన్ పరిధిలో సులేమాన్ ను అదుపులోకి తీసుకున్నారు.