తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  September 09 Ganesh Immersion Updates: భాగ్య నగరంలో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం..
హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం
హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం (AP)

September 09 Ganesh Immersion Updates: భాగ్య నగరంలో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం..

09 September 2022, 22:30 IST

  • September 09 Telugu News Updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ న్యూస్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం..

09 September 2022, 22:30 IST

సీఎంపై రాములమ్మ ఫైర్

హిమంత పాల్గొన్న సభా వేదికమీదకు టీఆర్ఎస్ కార్యకర్త వచ్చి మైక్ లాక్కోవడం.. ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన ఘటనే అన్నారు బీజేపీ నేత విజయశాంతి.  జరిగిన ఘటనకు సీఎం కేసీఆర్‌ సిగ్గుతో తలదించుకోవాలని మండిపడ్డారు.

09 September 2022, 21:34 IST

సీఎం ఆమోదం….

ఉద్యోగుల ఇరు రాష్ట్రాల మధ్య బదిలీల ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు 1338 మంది ఉద్యోగులు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఈ ఆమోద నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ కు పంపుతామని... అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే బదిలీలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించి ప్రక్రియ చేపడుతారని వివరించారు.

09 September 2022, 19:44 IST

ప్లాన్ ప్రకారమే దాడి…. 

ప్రజల విశ్వాసాన్ని ప్రజల పండుగలని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజేందర్. ఎన్నడూ లేని విధంగా గణేష్ నిమజ్జనాలపై హుస్సేన్ సాగర్ లో జరుపకూడదని ప్రభుత్వం ఆంక్షలు పెటిందని చెప్పారు. ప్రజల్లో ఒక గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందని విమర్శించారు. దీనికి ముఖ్యఅతిథిగా అస్సాం ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వచ్చాన్న ఆయన... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు రాష్ట్రప్రభుత్వం తనకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో టిఆర్ఎస్ వ్యక్తులే అడ్డుకున్నారు ఆయన్ని అగౌరపరిచేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక ప్రకారం ఈ దాడి చేస్తుందని దుయ్యబట్టారు.

09 September 2022, 19:44 IST

అలా మాట్లాడటం సరికాదు…

గణేష్ నిమజ్జనాలు సాఫీగా సాగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అస్సా ముఖ్యమంత్రి మొజంజాహి మార్కెట్ దగ్గరకు వచ్చి చాలా వల్గర్ గా మాట్లాడారని విమర్శించారు. మొజాంజాహి మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసిన స్టేజి ప్రభుత్వం ఏర్పాటు చేసిందే అని గుర్తు చేశారు. ఇంత దరిద్రమైన భాష ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు.

09 September 2022, 19:05 IST

ముగిసిన నిమజ్జనం

ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ముగిసింది. ఎన్టీఆర్ మార్గంలోని క్రైన్ నెం 4 వద ముగించారు. 

09 September 2022, 17:11 IST

చివరి దశకు యాత్ర…

ఖైరతాబాద్ గణేశ్ శోభయాత్ర చివరి దశకు చేరుకుంది. నిమజ్జనం చేసేందుకు క్రేన్ వద్దకు చేరింది.

09 September 2022, 16:27 IST

ఉద్రిక్త పరిస్థితి

ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అసోం సీఎం మాట్లాడుతుండగా టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ అడ్డుకునే ప్రయత్నం చేయగా… పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా రంగంలోకి దిగారు.

09 September 2022, 15:58 IST

హైదరాబాద్ లో అసోం సీఎం

అసోం సీఎం బిశ్వంత శర్మ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

09 September 2022, 15:58 IST

పలుచోట్ల వర్షం

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షంలోనే వినాయక నిమజ్జనం కొనసాగుతోంది.

09 September 2022, 15:57 IST

సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి జగన్ ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

09 September 2022, 15:18 IST

మంత్రి సీరియస్

వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావ్ ఖండించారు.ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే గవర్నర్ విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవన్నారు.

09 September 2022, 14:43 IST

రేవంత్ రెడ్డి ట్వీట్

పాల్వాయి స్రవంతికి శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులు తమ పార్టీకి ఎప్పుడూ ఉంటాయని ట్వీట్ చేశారు.

09 September 2022, 14:43 IST

విహంగ వీక్షణం….

మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ లు, DGP మహేందర్ రెడ్డి, CP ఆనంద్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి (areal view) గణేష్ నిమజ్జనాన్ని వీక్షిస్తారు.

09 September 2022, 13:46 IST

పిటిషన్ల ఉపసంహరణ

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను జగన్, విజయసాయిరెడ్డి ఉపసంహరించుకున్నారు. సీబీఐ నమోదు చేసిన కేసులపై విచారణ ముగిసిన తర్వాతే ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ చేపట్టాలన్న  నేపథ్యంలో గతంలో దాఖలు చేసిన పిటిషన్లు వెనక్కి తీసుకున్నారు.  జగతి పబ్లికేషన్స్ , విజయాసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.  తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించినందున పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. జగతి పబ్లికేషన్స్ తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి విచారణకు హాజరయ్యారు. 

09 September 2022, 13:44 IST

అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. తల్లి మరణంతో తాత్కలిక బెయిల్‌పై విడుదలపై అనంతబాబు  రాజమండ్రి కేంద్ర కారాగారంలో సరెండర్ అయ్యారు. 

09 September 2022, 13:43 IST

టీడీపీ నేతలకు రిమాండ్

చంద్రబాబు కుప్పం పర్యటన అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న ఆరుగురు టీడీపీ నేతలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.  ఆరుగురు టీడీపీ నేతలకు మరో 14 రోజులు రిమాండ్ విధించింది. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా టీడీపీ నేతలను తిరిగి చిత్తూరు జిల్లా జైలుకు  పోలీసులు తరలించారు. 

09 September 2022, 13:03 IST

పాల్వాయికే అభ్యర్ధిత్వం

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిత్వం పాల్వాయి స్రవంతి రెడ్డికే దక్కింది. రకరకాల ప్రచారాలకు తెర దించుతూ  పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ముకుల్ వాస్నిక్ ప్రకటన విడుదల చేశారు. 

09 September 2022, 12:11 IST

రైతుల యాత్రకు హైకోర్టు అనుమతి

రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతించింది. ిన్న రాత్రి అనుమతి నిరాకరిస్తూ డీజీపీ నోటీసులు  ఇచ్చిన నేపథ్యంలో  పిటిషన్ ను మొదటికేసుగా  హైకోర్టు విచారించింది.  పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది.  పోలీసులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.  దరఖాస్తు పరిశీలించి అనుమతులు ఇవ్వాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. 

09 September 2022, 11:53 IST

జైలుకు ఎమ్మెల్సీ అనంతబాబు

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎమ్మెల్సీ అనంతబాబు సరెండర్ అయ్యారు. తల్లి అంత్యక్రియల కోసం 14 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు, గడువు పూర్తి కావడంతో జైల్లో సరెండర్ అయ్యారు.  మధ్యంతర బెయిల్  గడువు ముగియడంతో రాజమండ్రి జైల్లో సరెండర్ అవ్వాలని గతంలోనే హైకోర్టు పేర్కోంది.

09 September 2022, 11:52 IST

లక్ష్మీ పార్వతి పిటిషన్ కొట్టివేత

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది.  చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ  లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.  ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే పిటిషన్ కొట్టివేసిందని, ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాలని ధర్మాసనం ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు.

09 September 2022, 11:50 IST

అద్దె కట్టలేదని ఆరోగ్య కేంద్రానికి తాళం

కడప జిల్లా జమ్మలమడుగులో పట్టణ ఆరోగ్య కేంద్రానికి ఇంటి యజమాని   సీతారాంరెడ్డి అద్దె చెల్లించడం లేదని తాళం వేశాడు.  ఆరోగ్య కేంద్రానికి 5 నెలలుగా అద్దె చెల్లించలేదని యజమాని ఆరోపిస్తున్నాడు.  ఆరోగ్య కేంద్రానికి తాళం వేయడంతో బయటే రోగులను  వైద్యులు పరీక్షిస్తున్నారు. 

09 September 2022, 11:04 IST

యథాతథంగా పదో తరగతి పరీక్షలు

తెలంగాణలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలకు మొదటి నుంచి ఉన్నట్లుగా 11 పేపర్లే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు స్పష్టం చేశారు. హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు(పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్‌ కూడా తగ్గించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి సిలబస్‌, పేపర్లను తగ్గించాలని తమకు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గత మే నెలలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించిన విషయం తెలిసిందే. 2023లో జరిగే పరీక్షలు మాత్రం  యథాతథంగా  జరుగనున్నాయి. 

09 September 2022, 11:00 IST

రికార్డు స్థాయి ధరకి బాలాపూర్‌ లడ్డు

బాలపూర్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. గత ఏడాదితో పోలిస్తే రూ.5.70లక్షల ధర అధికంగా పలికింది. గత ఏడాది రూ.18.90లక్షల ధరకు వేలం జరగ్గా ఈ ఏడాది రూ.24.60లక్షల ధరకు బాలపూర్‌ లడ్డును వేలంలో పాడుకున్నారు. లక్ష్మారెడ్డి రూ.24.60లక్షలకు బాలపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. లడ్డు వేలంపాటను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు తలసాని, తీగల కృష్ణారెడ్డి, మేయర్ పారిజాత పాల్గొన్నారు.

09 September 2022, 9:49 IST

కోస్తాలో భారీ వర్షాలు

రాష్ట్రంలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  - బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.  కోస్తా, ప్రకాశం రాయలసీమలో అనేకచోట్ల భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని హెచ్చరించారు.  - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు కురువనున్నాయి. ప్రకాశం, తూ.గో., గుంటూరు జిల్లాల్లో చాలాచోట్ల భారీ వర్షాలు,  రాయలసీమలో విస్తృతంగా, నెల్లూరులో అక్కడక్కడా భారీ వర్ష సూచన ఉంది. - మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దనిహెచ్చరించారు. 

09 September 2022, 9:48 IST

శోభా యాత్ర ప్రారంభం

ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రను  మంత్రి తలసాని ప్రారంభించారు. 

అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ గణేషుడిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.హైదరాబాద్ లో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ చేపట్టారు. 

09 September 2022, 9:32 IST

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో  భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.  శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం  పడుతోంది.  లేపాక్షి సర్కిల్ వరకు క్యూలైన్ బారులు తీరింది.  నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ఉంది.  శ్రీవారిని 65,470 మంది భక్తులు  దర్శించుకున్నారు.  29,899 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 

09 September 2022, 9:06 IST

కృష్ణా నది వరద‌ ఉధృతి

ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పోటెత్తుతోంది.  పులిచింతల నుంచి భారీగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ కు  వరద ప్రవాహం పెరిగింది.  ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  ప్రస్తుత ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులుగా ఉంది.  పులిచింతల ‌వద్ద ఔట్ ఫ్లో 4.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది.  వరద ప్రవాహం కొనసాగుతుండటంతో  కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. 

09 September 2022, 9:04 IST

ఎమ్మెల్సీ అనంతబాబు ….

 ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ గడువు నేటితో ముగియనుంది.  తల్లి మృతి చెందడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.  నేడు హైకోర్టులో అనంతబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో  మే 23 నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌లో ఉన్నారు. 

09 September 2022, 8:48 IST

శ్రీశైలంలో దసరా ఉత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ఈ నెల 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం పరిపాలన భవన్‌లో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, అధ్యాపక, వేదపండితులు, వివిధ విభాగాల అధికారులతో ఈవో లవన్న గురువారం సమీక్ష నిర్వహించారు.

09 September 2022, 8:48 IST

జంట జలాశయాలకు భారీగా వరద నీరు

భారీ వర్షాలతో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. హైదరాబాద్‌ జంట రిజర్వాయర్ల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌ నుంచి 2 గేట్లు, హిమాయత్‌సాగర్‌ నుంచి 2 గేట్లు ఎత్తినట్లు అధికారులు చెప్పారు. ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 600, ఔట్‌ఫ్లో 422 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్‌ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

09 September 2022, 8:48 IST

హైదరాబాద్‌లో వర్షాలు…

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాలోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుండడమే వర్షాలకు కారణమని వివరించింది. దీని ప్రభావంతో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, నిన్న హైదరాబాద్‌లోని కాప్రాలో గరిష్ఠంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అత్యల్పంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది

09 September 2022, 8:48 IST

అమరావతి మునిసిపాలిటీకి నోటిఫికేషన్

Amaravati  అమరావతి రాజధాని గ్రామాలతో  మున్సిపాలిటీ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 22గ్రామాలతో కొత్త మునిసిపాలిటీ ఏర్పాటు చేసేందుకు గ్రామ సభలను నిర్వహించాలని గుంటూరు కలెక్టర్ ఆదేశించారు. గత ఏడాదికి 19 గ్రామాలతో కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదనను  గ్రామసభల్లో వ్యతిరేకించారు. తాజాగా  పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త నాటకం ఆడుతోందని,  ప్రభుత్వ కుట్రల్ని కోర్టులోనే ఎదుర్కొంటామని చెబుతున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి