తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Non Veg Shops Close : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, వచ్చే ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

Hyderabad Non Veg Shops close : నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్, వచ్చే ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

17 April 2024, 22:01 IST

google News
    • Hyderabad Non Veg Shops close : హైదరాబాద్ లో నాన్ వెజ్ ప్రియులకు జీహెచ్ఎంసీ ఓ చిన్న బ్యాడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఆదివారం నగరంలో మీట్, బీఫ్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్
ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

ఆదివారం హైదరాబాద్ లో మాంసం షాపులు బంద్

Hyderabad Non Veg Shops close : ఆదివారం వచ్చిందంటే ఇళ్లలో నాన్ వెజ్(Non Veg) వంటల ఘుమఘమలాడుతుంటాయి. ఇక హైదరాబాద్ (Hyderabad)లో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల(Chicken Mutton Shops) ముందు రద్దీ కనిపిస్తుంది. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజీ బిజీగా ఉండే నగర వాసులు ఆదివారం... ఓ ముక్క, అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. దీంతో ముఖ్యంగా ఆదివారం నాన్ వెజ్ విక్రయాలు అధికంగా ఉంటాయి. కానీ హైదరాబాద్ వాసులకు ఓ చిన్న బ్యాడ్ న్యూస్... ఏంటంటే వచ్చే ఆదివారం(ఏప్రిల్ 21)న సిటీలో నాన్ వెజ్ దొరకదు. చికెన్, మటన్, ఇతర నాన్ వెజ్ విక్రయాలు(Hyderabad Non Veg Shops Close) ఉండవు. కారణంగా ఏంటంటే...మహావీర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను వచ్చే ఆదివారం మూసివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలతో ఆదివారం మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. జైనులకు మహావీర్ జయంతి(Mahavir Jayanti) చాలా ముఖ్యమైన పండుగ.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

హైదరాబాద్ లోనూ జైనుల సంఖ్య గణనీయంగా ఉండడంతో...మహావీర్ జయంతి నాడు నగరంలో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించింది జీహెచ్ఎంసీ. ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని కోరింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మాంసం షాపులు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం