Mahavir Jayanti 2023 : మహావీర్ జయంతి ఎప్పుడు? ఆయన గురించి తెలుసుకోండి-mahavir jayanti 2023 know the date history celebration and significance of mahavir swami birth anniversary ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mahavir Jayanti 2023 : మహావీర్ జయంతి ఎప్పుడు? ఆయన గురించి తెలుసుకోండి

Mahavir Jayanti 2023 : మహావీర్ జయంతి ఎప్పుడు? ఆయన గురించి తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 05:02 PM IST

Mahavir Jayanti 2023 : ప్రతీ ఏటా.. చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని త్రయోదని రోజున మహావీర్ జయంతిని నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు జైన మతస్తులు.

మహావీర్ జయంతి
మహావీర్ జయంతి (twitter)

చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున మహావీర్ జయంతిని నిర్వహిస్తారు. ఈ ఏడాది మహావీర్ జయంతి.. ఏప్రిల్ 4న వస్తుంది. జైనమతానికి చెందిన 24వ తీర్థంకరుడైన మహావీర్ స్వామి బీహార్‌లోని కుందగ్రామ్‌లో జన్మించారు. మహావీరుని చిన్ననాటి పేరు.. వర్ధమాన్.. 30 ఏళ్ల వయసులో రాజబోగ భాగ్యాలను త్యజించి.. సత్యాన్వేషణలో అడవుల బాట పట్టాడని చెబుతుంటారు. సుమారు పన్నెండేళ్లపాటు.. దట్టమైన అడవిలో కఠోర తప్పస్సు చేసి, ఆ తర్వాత నది ఒడ్డున సాల చెట్టు కింద జ్ఞానాన్ని పొందాడని అంటారు.

మహావీరుడు సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక బొధనలు చేశారు. మహావీర్ జయంతి శుభసమయం గురించి తెలుసుకుందాం.. పంచాంగం ప్రకారం, చైత్ర మాసంలో శుక్ల పక్ష త్రయోదశి తిథి 3 ఏప్రిల్ 2023 ఉదయం 06.24 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ మరుసటి రోజు అంటే 4 ఏప్రిల్ 2023 ఉదయం 08.05 గంటలకు ముగుస్తుంది. ఏప్రిల్ 04న ఉదయ తిథిని స్వీకరిస్తున్నారు. అందుకే.. మహావీర్ జయంతి ఏప్రిల్ 4న జరుపుతారని చెబుతున్నారు. జైన మతానికి చెందిన వారికి ఈ మాహావీర్ జయంతి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున జైన మతస్తులు ప్రభాత్ ఫేరీ, ఆచారాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు.

మాహావీర్.. మానవులు మోక్షాన్ని పొందడానికి ఐదు నియమాలను ఏర్పాటు చేశాడు. అదే పంచ సిద్ధాంతంగా పిలుస్తారు. అహింస, అస్తేయ, బ్రహ్మచర్య, సత్యం, అపరిగ్రహం. జైనులు మాహావీర్ జయంతి రోజున.. భగవాన్ మహావీరుడిని పూజిస్తారు. ఆయన బోధనలు స్మరించుకుంటారు.

చిన్న వయసులోనే అన్నింటిని త్యజించారు మహావీర్. రాజ కుటుంబంలో పుట్టిన ఆయనకు విలాసాలు, సౌకర్యాలకు లోటు ఏం లేదు. వాటిని మాత్రం అతడు కోరుకులేదు. ఖరీదైనవి ఏం ఆకర్షించలేదు. తన ఉనికి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. అందుకే చిన్న వయసులోనే.. రాజ్యాన్ని, కుటుంబాన్ని వదిలేసి ప్రశాంతత కోసం అడవుల్లోకి వెళ్లాడు. 12 సంవత్సరాలపాటు తప్పస్సు చేశాక జ్ఞానోదయం కలిగింది. తర్వాత మహావీరుడిగా మారారు. మగధ రాజ్యాలతోపాటుగా తూర్పునకు వెళ్లి తన సిద్ధాంతాలను బోధించాడు.

72వ ఏట మహావీరుడు తుది శ్వాస విడిచారు. అప్పటికే 23 మంది తీర్థంకరులు ఉన్నా.. మహావీరుడు హయాంలో జైన మతానికి విశేష ప్రాధాన్యత వచ్చింది. భారతదేశం నలువైపులా వ్యాపించింది. అహింస, ధర్మం గురించి మహావీరుడు ప్రచారం చేశారు. జైనులకు ఆరాధ్య దైవమయ్యాడు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఛైత్ర మాసంలో నిర్వహిస్తారు.

WhatsApp channel

టాపిక్