Keema Ball Sambar : కీమా బాల్ సాంబార్.. నాన్ వెజ్ ప్రియులకు నచ్చే రెసిపీ-today recipe how to make mutton keema ball sambar for rice ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Keema Ball Sambar : కీమా బాల్ సాంబార్.. నాన్ వెజ్ ప్రియులకు నచ్చే రెసిపీ

Keema Ball Sambar : కీమా బాల్ సాంబార్.. నాన్ వెజ్ ప్రియులకు నచ్చే రెసిపీ

Anand Sai HT Telugu
Jan 17, 2024 11:00 AM IST

Keema Ball Sambar Recipe : మటన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైనా కీమా బాల్ సాంబార్ ట్రై చేశారా? ఇదోరకం కొత్త రుచిని ఇస్తుంది.

కీమా బాల్ సాంబర్
కీమా బాల్ సాంబర్

కీమా ఉండే సాంబార్ మాంసాహారులకు ఇష్టమైన వంటకం. కొంతమంది దీనిని తయారు చేయడానికి గుడ్డుతోపాటు ఇతర పదార్థాలు కూడా వాడుతారు. కానీ కీమా సాంబార్ అవేమీ లేకుండా తయారు చేసుకోవచ్చు. నిజానికి నాన్-వెజ్ ప్రియులు తినడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అనేక రకాల ఆహారాలు ఉన్నా.. కొన్ని మాత్రమే ఎల్లప్పుడూ ఆహార ప్రియులకు అత్యంత ఇష్టమైనవిగా ఉంటాయి. అందులో కీమా సాంబార్ ఒకటి.

నాన్ వెజ్ వంటలు ఎన్ని ఉన్నా.. కీమాది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అన్ని పదార్థాలు ఉంటే ఇంట్లోనే రుచికరమైన కీమా చేసుకోవచ్చు. కొంతమంది కీమా సాంబార్ చేయడానికి గుడ్లను ఉపయోగిస్తారు. అవేమీ లేకుండా కీమాను తయారు చేయెుచ్చు.

కీమా సాంబార్‌కు కావాల్సిన పదార్థాలు

మటన్ కీమా - 1/2 కేజీ, కొత్తిమీర - 1.5 టీస్పూన్, లవంగాలు - 12, దాల్చిన చెక్క - 1/2 అంగుళం, ఏలకులు - 6, అల్లం పేస్ట్ - 1 టీస్పూన్, వెల్లుల్లి - 1 టీస్పూన్, ఉప్పు - రుచి ప్రకారం, రెడ్ చిల్లీ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 2, టొమాటో - 2, నూనె - 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - 1/2 కప్పు

కీమా సాంబార్‌ తయారీ విధానం

1. ముందుగా కీమాను శుభ్రంగా కడిగి నీళ్లు పోయాండి. తర్వాత మిక్సీ జార్‌లో కొబ్బరి, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, లవంగాలు, యాలకులు వేయాలి.

2. అందులో కొంచెం ఉప్పు పొడి వేసి మెత్తగా రుబ్బుకోవాలి. (నీరు కలపొద్దు)

3. పాన్ లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, టొమాటో వేసి వేయించాలి.

4. ముందుగా గ్రైండ్ చేసిన మిశ్రమంతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

5. అయితే దాని నుండి 2 టేబుల్ స్పూన్ల మసాలా తీసి విడిగా ఉంచండి.

6. ఈ మిశ్రమాన్ని మరో మిక్సీలో గ్రైండ్ చేయండి.

7. మీ చేతులకు ఆయిల్ రాసుకుని మటన్ కీమాను అందులో కలిపి.. ఈ మిశ్రమాన్ని బాల్స్‌గా చేసుకోవాలి.

8. పాన్‌లో కొంచెం నూనె వేసి వేడయ్యాక కీమా బాల్స్‌ని ఒక్కొక్కటిగా వేసి నెమ్మదిగా రోస్ట్ చేయాలి.

9. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు, ముందుగా రుబ్బిన మసాలా దినుసులు జోడించండి.

10. ఉప్పు, నీళ్లు వేసుకుని 20 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత కీమా సాంబార్ రెడీ.

11. ఈ కీమా ఉండే సాంబార్ రోటీ, చపాతీ, అన్నంతో మంచి కాంబినేషన్.

WhatsApp channel