తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Samosa: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? ఇలా చికెన్ సమోసాలు చేసుకోండి

Chicken Samosa: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? ఇలా చికెన్ సమోసాలు చేసుకోండి

Haritha Chappa HT Telugu

13 April 2024, 15:30 IST

google News
    • Chicken Samosa: ఆలూ సమోసా తినే వారి సంఖ్య ఎక్కువే, అలాగే చికెన్ సమోసా అని వండుకోవచ్చు. ఒక్కసారి ఈ చికెన్ సమోసా రెసిపీ ప్రయత్నించండి.
చికెన్ సమోసా
చికెన్ సమోసా

చికెన్ సమోసా

Chicken Samosa: కూర వండాక ఎంతో కొంత మిగిలిపోవడం సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. చికెన్ కూర మిగిలిపోయినప్పుడు సాయంత్రం వాటితో స్నాక్స్‌ని చేసుకోవచ్చు. చికెన్ సమోసా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. ఆల్రెడీ చికెన్ రెడీగా ఉంది కాబట్టి, పావుగంటలో దీన్ని చేసుకోవచ్చు. ఇది క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. దీని రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం .

చికెన్ సమోసా రెసిపీకి కావలసిన పదార్థాలు

మిగిలిపోయిన చికెన్ కర్రీ - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

క్యాప్సికం - అరముక్క

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - తగినంత

మైదాపిండి - మూడు స్పూన్లు

సమోసా షీట్స్ - తగినన్ని

చికెన్ సమోసా రెసిపీ

1. సమోసాలను చుట్టే షీట్స్‌ను ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి.

2. చికెన్ కర్రీలోంచి ఎముకలను తీసేసి మెత్తటి ముక్కలను మాత్రమే తీసుకోవాలి. దీన్ని సన్నగా తరుగుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి ఈ చికెన్ వేసి బాగా వేయించుకోవాలి.

4. చికెన్ కర్రీ తడి లేకుండా పొడిపొడిగా అయ్యేవరకు చిన్న మంట మీద వేయించాలి.

5. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

6. ఒక మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ కట్టేయాలి.

7. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండిని వేయాలి.

8. తగినన్ని నీళ్లు పోసి అది పేస్ట్ లాగా వచ్చేలా చేయాలి.

9. సమోసా షీట్లను ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి.

10. ఈ సమోసా షీట్లను సమోసా ఆకారంలో మడిచి ఆ మధ్యలో వేయించిన చికెన్ మిశ్రమాన్ని వేయాలి.

11. అంచులను మడిచేసి ఈ మైదా పిండి పేస్టును రాస్తే అవి అతుక్కుంటాయి.

12. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి.

13. నూనె వేడెక్కాక ఈ సమోసాలను వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

14. ఆ తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే చికెన్ కర్రీ సమోసాలు రెడీ అయినట్టే.

15. చికెన్ కర్రీతో ఇలా సమోసాలు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

పిల్లలకు ఈ చికెన్ సమోసాలు చాలా నచ్చుతాయి. వీటిని టమాటో కెచప్‌తో లేదా మయోన్నెస్‌తో తిన్నాటేస్టీగా ఉంటాయి. ఈ సమోసాలను ఒక్కసారి చేసి చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. వీటిని చేయడం చాలా సులువు. చికెన్ కర్రీ వండి ఉంటుంది. కాబట్టి సమోసా షీట్లు రెడీ చేసుకుంటే చాలు, మిగతా పని పది నిమిషాల్లో అయిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం