తెలుగు న్యూస్  /  Telangana  /  Former Chennur Mla Nallala Odelu Joins In Trs

Joins in TRS: కాంగ్రెస్ కు షాక్… మళ్లీ టీఆర్ఎస్ గూటికి నల్లాల ఓదెలు

HT Telugu Desk HT Telugu

05 October 2022, 13:22 IST

    • ex mal nallala odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఓదెలు
టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఓదెలు (twitter)

టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఓదెలు

Nallala odelu family joins in trs:నల్లాల ఓదెలు... చెన్నూరు మాజీ ఎమ్మెల్యే...! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అనూహ్య పరిణామాల మధ్య ఆయనకు 2018లో టికెట్ దక్కలేదు. అప్పట్నుంచి అసంతృప్తిగా ఉన్న ఆయన...కొద్దిరోజుల కిందట రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన భార్య మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆమె కూడా హస్తం గూటికి చేరారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఓదెలు. ఆయన తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తిరిగి టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అయ్యారు. మంత్రి కేటీఆర్‌ ఓదెలు దంపతులకు గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. 2009, 2014లో టీఆర్‌ఎస్‌ తరపున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా నల్లాల ఓదెలు గెలుపొందారు. 2018లో ఈ స్థానం నుంచి విద్యార్థి నేత బాల్క సుమన్ కు టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినప్పటికీ.. ఎమ్మెల్సీ ఇస్తారనే హామీతో ఓదెలు కాస్త వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పరిస్థితులు మారిపోవటంతో... కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ లో చేరిన సందర్భంలోనూ ఓదెలు సుమన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సుమన్ గెలుపు కోసం కృషి చేశానని తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాల్క సుమన్ తమను పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రలు పన్నినట్టుగా చెప్పారు. మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా తన భార్య భాగ్యలక్ష్మి ఉందని. ఆమె విషయంలో ప్రోటో కాల్ పాటించడంలేదన్నారు. ఇలా ఎన్నో విషయాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

టాపిక్