తెలుగు న్యూస్  /  Telangana  /  First Underground Metro In Hyderabad Here's Details

Hyderabad Underground Metro : హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో.. ఇక్కడే

HT Telugu Desk HT Telugu

29 November 2022, 19:56 IST

    • Underground Metro In Hyderabad : మెట్రో ప్రయాణికులకు మరో శుభవార్త. హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో రానుంది. రెండో దశ పనుల్లో భాగంగా ఇది నిర్మితమవనుంది.
హైదరాబాద్ మెట్రో (ఫైల్ ఫొటో )
హైదరాబాద్ మెట్రో (ఫైల్ ఫొటో ) (twitter)

హైదరాబాద్ మెట్రో (ఫైల్ ఫొటో )

భాగ్యనగరంలో మెుదటిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో(Underground Metro) రానుంది. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ మెట్రో విస్తరణ పనులకు సీఎం కేసీఆర్(CM KCR) శంకుస్తాపన చేయనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. రాయదర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు(Raidurg To Airport Metro) వరకు 31 కిలో మీటర్ల దూరం మెట్రో విస్తరణ జరగుంది. అయితే ఎయిర్ పోర్ట్(Air Port) సమీపంలో 2.5 కిలో మీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్టుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించే 31 కిలోమీటర్ల కారిడార్‌కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy) చెప్పారు. ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. హైదరాబాద్​(Hyderabad)లో మెట్రో సేవలు ప్రారంభమై ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

'నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుంది. మెట్రో రైలు(Metro Rail) అందుబాటులోకి వచ్చిన మెుదటి రోజునే.. రెండు లక్షల మంది ప్రయాణించారు. ఇప్పుడు నిత్యం 4 లక్షల 40వేల మంది ప్రయాణిస్తున్నారు. రాయదుర్గం టూ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9న కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.' అని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

రెండో దశ పనులకు డిసెంబర్ 9న శ్రీకారం చుట్టనున్నారు. మైండ్ స్పేస్ దగ్గర గల రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్(mind space to shamshabad airport) వరకు మెట్రో నిర్మించనున్నారు. 31 కిలోమీటర్లు ఉండగా.. 6 వేల 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రెండో దశ పనులకు డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) శుంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) విస్తరణపై గతంలోనే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిప్రీత్ సింగ్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిధులను కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా.. విస్తరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు. రెండో దశ పనులు పూర్తయి.. మెట్రో అందుబాటులోకి వస్తే.. ఎయిర్ పోర్టు(Air Port) వెళ్లేవారికి ప్రయాణం సులభం కానుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చేవారు కూడా ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా రావొచ్చు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా.. పనులు చేస్తామని కేటీఆర్ మాత్రం స్పష్టం చేశారు.

ఈ మెట్రో వయా బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ ను తాకుతూ వెళ్లనుంది. ఎయిర్ పోర్ట్ నుంచి.. ప్రత్యేక మార్గం ద్వారా మెట్రో రైలు నడుస్తుంది. 31 కిలో మీటర్ల పొడవుతో రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది.